పులి మాంసాహారి అనే విషయం అందరికీ తెలుసు.అది మాంసం తప్పితే వేరేది తినదు.
అడవుల్లో జంతువులను వెంటాడి తినేస్తుంది.మనుషులు కనిపించినా పీక్కు తినేస్తుంది.
మాంసాహారం తప్పితే పులి మిగతా ఏవీ తినదు.అందుకే పులి పేరు చెబితేనే చాలామంది భయపడుతూ ఉంటారు.
అలాంటి మాంసాహారి అయిన పులి పాలు తాగడం వింతగా ఉంది కదా.? ఇది ఆశ్చర్యకంగా ఉంది కదా.? నమ్మశక్యంగా లేకపోయినా ఇది ముమ్మాటికీ నిజం.
పులి పాలు తాగుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
తెలుపు రంగులో ఉన్న ఈ పులి సంరక్షణ కేంద్రంలో ఉంది.దీనికి ఓ కేర్ టేకర్ కూడా ఉన్నారు.
ఈ పులికి ఓ మహిళ పాలు తాపిస్తుంది.పులి కూడా పీపాలు పీపాలు పాలు తాగుతోంది.
డిస్కవర్ యానిమల్ అనే ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఈ వీడియోను షేర్ చేశారు.దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.చాలా క్యూట్ గా ఉందని కామెంట్లు చేస్తున్నారు.
ఈ వీడియోకు ఇప్పటికే 6.70 లక్షల వ్యూస్ రాగా.60 వేలకుపైగా లైక్స్ వచ్చాయి.మాంసాహారి అయిన పులి.
శాకాహారిగా మారడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.పులి పిల్లిలాగా మారి పాలు తాడం చూస్తుంటే చాలా విచిత్రంగా ఉందని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఈ పులి పిల్ల చాలా బాగుందని కామెంట్స్ పెడుతున్నారు.ఇది ఓ మిరాకిల్ అని, పులి పాలు తాగడం ఆశ్చర్యకరంగా ఉందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
అసలు ఇది నిజమేనా అని మరికొందరు సోషల్ మీడియాలో అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఏది ఏమైనప్పటికీ ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.