డబ్బు కోసం కిడ్నాప్ .. చివరికి కటకటాల వెనక్కి, యూకేలో ముగ్గురు భారత సంతతి వ్యక్తులకు 45 ఏళ్ల జైలు

సులభంగా డబ్బు సంపాదించాలని భావించిన ముగ్గురు భారత సంతతి వ్యక్తులు యూకేలో( UK ) కటకటాల పాలయ్యారు.వీరు ముగ్గురికి కలిపి 45 ఏళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం.

 Three Indian-origin Men Jailed For Kidnapping Businessman For Ransom In Uk Detai-TeluguStop.com

ఇంగ్లాండ్‌లోని వెస్ట్ మిడ్‌లాండ్స్ ప్రాంతంలోని వోల్వర్‌హాంప్టన్ సిటీ సెంటర్‌లో ఒక వ్యాపారవేత్తను కిడ్నాప్ చేసిన ఇద్దరు భారతీయ సంతతికి చెందిన సోదరులు, వారి అనుచరుడైన మరో వ్యక్తికి మొత్తం 45 జైలు శిక్ష విధించింది.బల్జీత్ బఘ్రాల్ (33),( Baljit Baghral ) అతని సోదరుడు డేవిడ్ బఘ్రాల్ (28),( David Baghral ) మరో వ్యక్తి 22 ఏళ్ల షానుతో( Shanu ) కలిసి గతేడాది నవంబర్‌లో పని ముగించుకుని తన కారు వద్దకు వెళ్తున్న ఓ వ్యాపారవేత్తను బంధించారు.

అనంతరం అతనిని ఒక వ్యాన్‌లో పడేసి.కళ్లకు గంతలు కట్టి ఓ ప్రాంతానికి తీసుకెళ్లారు.

తర్వాత బాధితుడి తలపై తుపాకీ పెట్టి బెదిరించి.తీవ్రంగా హింసించారు.

Telugu Prison, Baljit Baghral, David Baghral, Indianorigin, Businessman, Ransom,

గత నెలలో వోల్వర్‌హాంప్టన్ క్రౌన్ కోర్టులో( Wolverhampton Crown Court ) జరిగిన విచారణ అనంతరం వీరు ముగ్గురు దోషులుగా తేలారు.అనంతరం ఈ వారం బఘ్రాల్ సోదరులు ఒక్కొక్కరికి 16 సంవత్సరాల జైలు శిక్ష, వారి సహచరుడికి 13 సంవత్సరాల నాలుగు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం.నిందితులు ముగ్గురు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలనే ఏకైక లక్ష్యంతో ఈ కుట్ర చేశారని… కానీ ఇప్పుడు జైలులో శిక్ష అనుభవిస్తున్నారని పోలీసులు తెలిపారు.

Telugu Prison, Baljit Baghral, David Baghral, Indianorigin, Businessman, Ransom,

బాధితుడిని కొన్ని గంటల పాటు బంధించగా 19,000 జీబీపీ నగదును అప్పగించిన తర్వాతే నిందితులు అతనిని విడుదల చేశారు.వ్యాన్ నుంచి బయటపడ్డ వెంటనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.రంగంలోకి దిగిన వెస్ట్ మిడ్‌లాండ్స్ పోలీసులు సీసీటీవీ , నెంబర్ ప్లేట్ , మొబైల్ ఫోన్ డేటా ఆధారంగా నిందితులను గుర్తించారు.

అనంతరం డేవిడ్ బఘ్రాల్‌ను , ఆ మరుసటి రోజు బల్జిత్‌ను అరెస్ట్ చేశారు.ఇది జరిగిన కొన్ని రోజులకు అమెరికాకు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా.షానును హీత్రూ ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube