జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది.దరూర్ మండలం పార్చర్ల వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను బొలెరో వాహనం ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు.మృతులు గద్వాలకు చెందిన జమునమ్మ, వైష్ణవి, అర్జున్ లుగా గుర్తించారు.
వ్యాపారం నిమిత్తం రాయచూర్ కు వెళ్తుండగా ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.