ఆమద్య ఒక వ్యక్తి బయట ఉంటే పని చేయాలి, డబ్బు సంపాదించాలి, సరైన తిండి దొరకడం లేదు అంటూ చిన్న చిన్న నేరాలు చేసి జైల్లో పడ్డ విషయం తెల్సిందే.బెయిల్ కోసం ప్రయత్నాలు చేయకుండా కేవలం జైల్లో శిక్ష అనుభవించేందుకు తప్పులు చేస్తూనే ఉన్నాడు.
తాజాగా అలాంటోడే ఇప్పుడు చెన్నైలో కనిపించాడు.అయితే వాడు బయట ప్రపంచంలో బతక లేక కాదు కాని, జైల్లో ఉన్న స్నేహితులను వదిలి ఉండలేక మళ్లీమళ్లీ జైలుకు వెళ్లడం చేశాడు.
ఇతడి విషయం తెలిసి పోలీసులు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.

చెన్నైకు చెందిన ప్రకాశం అనే 50 ఏళ్ల వ్యక్తి ఒక కేసులో యావజ్జీవం అనుభవించాడు.ఆ కేసులో అతడు శిక్ష పూర్తి చేసుకుని బయటకు వచ్చాడు.బయటకు వచ్చిన తర్వాత అతడికి అగమ్య గోచరంగా ఉంది.
ఏం చేయాలో అతడికి పాలుపోలేదు.ఏం చేద్దామన్నా కూడా అతడికి మెంటల్ ఎక్కినంత పనైంది.
దాంతో అతడు మళ్లీ జైలుకు వెళ్లాలనుకున్నాడు.అక్కడ స్నేహితులు అయిన వారిని వదిలి ఉండాలనిపించలేదు.
కుటుంబ సభ్యుల కంటే కూడా అధికంగా వారినే ఇష్టపడ్డాడు.

జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జైలుకు వెళ్లడం మొదలు పెట్టాడు.అతడు పదే పదే జైలుకు వస్తున్న నేపథ్యంలో పోలీసులు అతడిని ప్రశ్నిస్తే నాకు బయట మంచి స్నేహితులు లేరు.జైల్లో ఉన్న వారే నాకు నిజమైన స్నేహితులు.
నా కుటుంబ సభ్యుల కంటే కూడా నా జైలు స్నేహితులతోనే జీవితంను సంతోషంగా సాగించాలని కోరుకుంటున్నాను.అందుకే మళ్లీ మళ్లీ జైలుకు వస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడట.
ఇతడి మాటలు విని బాబోయ్ వీడు మహా తేడా అని పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.