జైలర్ లోని ఆ డైలాగ్ కు రజనీ లైఫ్ కు లింక్ ఇదా.. ఆ విషయంలో రజనీ ఎంతో బాధపడుతున్నారా?

రజనీకాంత్ నెల్సర్ దిలీప్ కుమార్( Nelser Dilip Kumar ) కాంబో మూవీ జైలర్ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది.అనిరుధ్ మ్యూజిక్ ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది.

 This Is The Link Between Jailar Movie And Rajanikanth Life Details Here Goes Vi-TeluguStop.com

మోహన్ లాల్, శివరాజ్ కుమార్ ఈ సినిమాలో గెస్ట్ రోల్స్ లో నటించగా వాళ్లిద్దరి పాత్రలు సైతం ఎంతగానో ఆకట్టుకున్నాయి.అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయిందని తెలుస్తోంది.

సెప్టెంబర్ 7 నుంచి సన్ నెక్స్ట్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని సమాచారం.

సినిమా విడుదలైన నాలుగు వారాల్లోనే జైలర్ మూవీ ( Jailer movie )ఓటీటీలో విడుదల కానుంది.

అయితే వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.జైలర్ హిందీ వెర్షన్ మాత్రం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది.ఇప్పటివరకు ఈ సినిమా 550 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.ఏడు పదుల వయస్సులో రజనీకాంత్ జైలర్ సినిమాతో ఈ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకోవడం ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.

Telugu Jailar, Mohanlal, Rajanikanth, Shivraj Kumar-Movie

అయితే జైలర్ సినిమాలోని ఒక డైలాగ్ కు రజనీకాంత్ లైఫ్ కు లింక్ ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కోలీవుడ్ డైరెక్టర్ ప్రవీణ్ గాంధీ( Kollywood director Praveen Gandhi ) మాట్లాడుతూ జైలర్ సినిమా క్లైమాక్స్ సీన్ లో ఏదైనా చెప్పాలని ఉందా అని రజనీ తన కొడుకును అడుగుతాడని ఆ సమయంలో రజనీ రియల్ లైఫ్ పెయిన్ కూడా కనిపిస్తుందని ప్రవీణ్ గాంధీ పేర్కొన్నారు.ఆ డైలాగ్ చెప్పే సమయంలో రజనీ ధనుష్, ఐశ్వర్య గురించి ఆలోచించి ఉండవచ్చని ప్రవీణ్ గాంధీ అన్నారు.

Telugu Jailar, Mohanlal, Rajanikanth, Shivraj Kumar-Movie

ఈ నాన్నగారితో ఏదైనా చెప్పాలా అని రజనీ తన కూతురిని కూడా చాలాసార్లు అడిగి ఉండవచ్చని ప్రవీణ్ గాంధీ వెల్లడించారు.రజనీ రియల్ లైఫ్ ఘటనలకు ఆ సీన్ దగ్గరగా ఉందని ప్రవీణ్ గాంధీ పేర్కొన్నారు.రజనీ కూతుళ్లను చాలా ఇష్టపడతాడని అయితే వాళ్ల జీవితంలో జరిగిన ఘటనలు బాధ పెట్టాయని ప్రవీణ్ గాంధీ చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube