జైలర్ లోని ఆ డైలాగ్ కు రజనీ లైఫ్ కు లింక్ ఇదా.. ఆ విషయంలో రజనీ ఎంతో బాధపడుతున్నారా?

రజనీకాంత్ నెల్సర్ దిలీప్ కుమార్( Nelser Dilip Kumar ) కాంబో మూవీ జైలర్ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది.

అనిరుధ్ మ్యూజిక్ ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది.మోహన్ లాల్, శివరాజ్ కుమార్ ఈ సినిమాలో గెస్ట్ రోల్స్ లో నటించగా వాళ్లిద్దరి పాత్రలు సైతం ఎంతగానో ఆకట్టుకున్నాయి.

అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయిందని తెలుస్తోంది.

సెప్టెంబర్ 7 నుంచి సన్ నెక్స్ట్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని సమాచారం.

సినిమా విడుదలైన నాలుగు వారాల్లోనే జైలర్ మూవీ ( Jailer Movie )ఓటీటీలో విడుదల కానుంది.

అయితే వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.జైలర్ హిందీ వెర్షన్ మాత్రం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది.

ఇప్పటివరకు ఈ సినిమా 550 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.ఏడు పదుల వయస్సులో రజనీకాంత్ జైలర్ సినిమాతో ఈ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకోవడం ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.

"""/" / అయితే జైలర్ సినిమాలోని ఒక డైలాగ్ కు రజనీకాంత్ లైఫ్ కు లింక్ ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కోలీవుడ్ డైరెక్టర్ ప్రవీణ్ గాంధీ( Kollywood Director Praveen Gandhi ) మాట్లాడుతూ జైలర్ సినిమా క్లైమాక్స్ సీన్ లో ఏదైనా చెప్పాలని ఉందా అని రజనీ తన కొడుకును అడుగుతాడని ఆ సమయంలో రజనీ రియల్ లైఫ్ పెయిన్ కూడా కనిపిస్తుందని ప్రవీణ్ గాంధీ పేర్కొన్నారు.

ఆ డైలాగ్ చెప్పే సమయంలో రజనీ ధనుష్, ఐశ్వర్య గురించి ఆలోచించి ఉండవచ్చని ప్రవీణ్ గాంధీ అన్నారు.

"""/" / ఈ నాన్నగారితో ఏదైనా చెప్పాలా అని రజనీ తన కూతురిని కూడా చాలాసార్లు అడిగి ఉండవచ్చని ప్రవీణ్ గాంధీ వెల్లడించారు.

రజనీ రియల్ లైఫ్ ఘటనలకు ఆ సీన్ దగ్గరగా ఉందని ప్రవీణ్ గాంధీ పేర్కొన్నారు.

రజనీ కూతుళ్లను చాలా ఇష్టపడతాడని అయితే వాళ్ల జీవితంలో జరిగిన ఘటనలు బాధ పెట్టాయని ప్రవీణ్ గాంధీ చెప్పుకొచ్చారు.

మెగా హీరోలకు వరుస ఫ్లాపుల వెనుక కారణాలివేనా.. తెర వెనుక ఇంత జరుగుతోందా?