సూర్య కెరీర్ లో ఎన్ని బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఉన్నా గజిని సినిమా ( Ghajini Movie )ప్రత్యేకం అనే చెప్పాలి.ఈ సినిమాలో సూర్య పర్ఫామెన్స్ న భూతో న భవిష్యత్ అనేలా ఉంటుంది.
సంజయ్ రామస్వామి పాత్రలో సూర్యను కాకుండా మరో నటుడిని ఊహించుకోవడం కూడా సులువు కాదనే సంగతి తెలిసిందే.అయితే గజిని సినిమాకు పవన్ కళ్యాణ్ కు ఉన్న లింక్ ఇదేనంటూ వైరల్ అవుతుండగా ఆ లింక్ హాట్ టాపిక్ అవుతోంది.
తమిళంలో సూర్య హీరోగా గజిని సినిమా షూట్ పూర్తైన తర్వాత ఈ సినిమా కాన్సెప్ట్ అద్భుతంగా ఉండటంతో ఈ సినిమాను తెలుగులో పవన్ హీరోగా రీమేక్ చేస్తే బాగుంటుందని ప్రతిపాదన వచ్చిందట.అయితే పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )మాత్రం అలాంటి లుక్స్ తో అభిమానులు తనను అంగీకరించరని చెప్పి ఆ ప్రపోజల్ ను రిజెక్ట్ చేశారు.
ఆ తర్వాత గజిని తమిళ్ వెర్షన్ తో పాటు తెలుగు వెర్షన్ కూడా థియేటర్లలో విడుదలై హిట్టైంది.
జానీ సినిమా( Johnny ) రిజల్ట్ వల్ల కూడా గజిని తెలుగు వెర్షన్ లో నటించడానికి పవన్ భయపడ్డారని అందుకే నో చెప్పారని తెలుస్తోంది.పవన్ ఈ సినిమాకు సూట్ కారని నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ పొలిటికల్ కార్యక్రమాల వల్ల షూటింగ్ లకు కొంతకాలం పాటు బ్రేక్ ఇచ్చారని సమాచారం అందుతోంది.
పవన్ భవిష్యత్తు మూడు ప్రాజెక్ట్ లు కొన్ని నెలల గ్యాప్ లోనే థియేటర్లలో రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది.
ఈ ఏడాది బ్రో సినిమాను( BRO movie ) రిలీజ్ చేసిన పవన్ ఏడాదికి ఒక సినిమా విడుదలయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.పవన్ భిన్నమైన కథలను ఎంచుకుంటూ ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తున్నారు.రాబోయే రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరిన్ని భారీ విజయాలు దక్కుతాయేమో చూడాలి.