స్టార్ హీరో అల్లు అర్జున్( Allu Arjun ) పుష్ప1, పుష్ప2 సినిమాల కోసం దాదాపుగా నాలుగేళ్ల సమయం కేటాయించిన సంగతి తెలిసిందే.గడిచిన రెండున్నరేళ్లలో అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రైజ్ మాత్రమే విడుదలైంది.
ప్రస్తుతం పుష్ప ది రూల్ సినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్ వచ్చే ఏడాది ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.ఆ సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేయడం వల్ల ఈ సినిమాకు లాంగ్ వీకెండ్ బెనిఫిట్ కలగనుంది.
ఈ సినిమా తర్వాత బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా ఫైనల్ అయింది.త్రివిక్రమ్ సినిమా తర్వాత బన్నీ ఎవరి డైరెక్షన్ లో నటిస్తారనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకడం లేదు.
చాలామంది డైరెక్టర్లతో బన్నీ సినిమా అంటూ ప్రచారం జరుగుతున్నా అధికారికంగా ప్రకటనలు మాత్రం రావడం లేదు.గతంలో వరుసగా ప్రాజెక్ట్ లను ప్రకటించిన బన్నీ ఇప్పుడు కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి తడబడుతున్నారు.
చాలామంది డైరెక్టర్లకు బన్నీ హ్యాండ్ ఇస్తుండటంతో బన్నీని నమ్మలేమని డైరెక్టర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కథల విషయంలో అల్లు అర్జున్ రాజీ పడరని ఈ లక్షణం అల్లు అర్జున్ కు నాన్న నుంచి వచ్చిన లక్షణమని తెలుస్తోంది.రెమ్యునరేషన్, మార్కెట్ ఊహించని స్థాయిలో పెరగడంతో దర్శకులతో బన్నీ కుర్చీలాట ఆడుతున్నారని కూడా కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి.
రాజమౌళి, ప్రశాంత్ నీల్, లోకేశ్ కనగరాజ్ లాంటి డైరెక్టర్లు వేర్వేరు కారణాల వల్ల బన్నీపై దృష్టి పెట్టడం లేదు.అయితే అల్లు అర్జున్ తనపై దృష్టి పెట్టిన డైరెక్టర్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం కరెక్ట్ కాదని మరి కొందరు చెబుతున్నారు.బన్నీ కెరీర్ ప్లానింగ్ అర్థం కావడం లేదని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.