అమెజాన్‌ బెస్ట్ మొబైల్ ఇదే... అంతలా అమ్ముడుపోతుంది మరి!

అమెజాన్‌ బెస్ట్ మొబైల్( Amazon best mobile ) అంటే ఏమనుకుంటున్నారు? అదేనండి, అమెజాన్‌ ( Amazon )సైట్ ద్వారా రికార్డు స్థాయిలో అమ్ముడు పోయే మొబైల్ అన్నమాట.మీరు ఇది పరీక్షించి వుండరు కదూ.

 This Is Amazon S Best Mobile It Will Sell So Much , Amazon Best Mobile,amazon ,-TeluguStop.com

ఇక్కడ స్మార్ట్ ఫోన్ ( Smart phone )వాడుతున్న ప్రతి ఒక్కరూ రోజులో ఒక్కసారైనా అమెజాన్‌ ని ఓపెన్ చేస్తూ వుంటారు.ఈ క్రమంలో ఇలాంటి విషయాలను ఏ కొద్దిమందో పరీక్షించి, తమ తమ స్నేహితులకు చెబుతూ వుంటారు.

మీకు ఇపుడు మేము చెబుతున్నాం.ఐకూ ఇండియా నుంచి ఇటీవల ‘ఐకూ జెడ్7 5జీ‘( IQOO Z7 5G ) స్మార్ట్‌ఫోన్ లాంఛ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.

విషయం ఏమిటంటే… ఇప్పుడు అమెజాన్‌లో ఇదే బెస్ట్ మొబైల్అని ఐకూ తాజాగా ప్రకటించింది.అమెజాన్‌లో హయ్యెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ గా “ఐకూ జెడ్7 5జీ” మోడల్ రికార్డు సాధించింది.2023లో రూ.15,000 నుంచి రూ.20,000 మధ్య లాంఛ్ అయిన మొబైల్స్‌లో ఈ మొబైల్ రికార్డ్ సృష్టించినట్టు వెల్లడించింది.ఐకూ జెడ్7 5జీ 2 వేరియంట్లలో రిలీజైంది.6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గా వుంది.

ఇక కలర్స్ విషయానికొస్తే, రెండు కలర్స్ లో మార్కెట్లోకి వచ్చింది. నార్వే బ్లూ, పసిఫిక్ నైట్ కలర్స్‌లో ఇవి అందుబాటులో వున్నాయి.అమెజాన్ ఇండియా, ఇంకా ఐకూ ఇ-స్టోర్లలో వీటిని కొనుగోలు చేయొచ్చు.

ఇంకా అమెజాన్‌లో బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో వున్నాయి.హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ కార్డులతో కొంటే రూ.1,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.ఇక ఐకూ జెడ్7 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే… ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌, 6.38 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే కలిగి వుంది.మీడియాటెక్ డైమెన్సిడీ 920 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.ఆండ్రాయిడ్ 13 + ఫన్‌టచ్ ఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.4500ఎంఏహెచ్ బ్యాటరీ, 44వాట్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube