ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా కోట్లాది మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు.రక్తహీనతకు ప్రధాన కారణం ఐరన్ లోపం.
శరీరానికి అవసరమయ్యే ఐరన్ ను అందించడం ద్వారా రక్తహీనతను వదిలించుకోవచ్చు.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ చాలా బాగా సహాయపడుతుంది.
ఈ డ్రింక్ ను వారానికి రెండు సార్లు కనుక తీసుకుంటే రక్తహీనత దూరం అవ్వడమే కాదు మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందుతారు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు బెల్లం పొడి( Jaggery powder ) వేసుకోవాలి.అలాగే పది ఫ్రెష్ పుదీనా ఆకు( Mint Leave )లు, రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్, పావు టీ స్పూన్ పింక్ సాల్ట్( Pink salt ) వేసుకోవాలి.చివరిగా ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకుంటే మన డ్రింక్ అనేది సిద్ధం అవుతుంది.స్టైనర్ సహాయంతో తయారు చేసుకున్న బెల్లం పుదీనా డ్రింక్ ను ఫిల్టర్ చేసుకుని నేరుగా సేవించాలి.
ఈ డ్రింక్ లో ఐరన్ రిచ్ గా ఉంటుంది.అందువల్ల దీన్ని డైట్ లో చేర్చుకుంటే రక్తహీనత దూరం అవుతుంది.ఈ డ్రింక్ కు రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు ఉన్నాయి.రక్తంలో పేరుకుపోయిన మలినాలను సమర్థవంతంగా తొలగిస్తుంది.అలాగే ఈ డ్రింక్ శరీరానికి చల్లదనాన్ని అందించడంతో పాటు అనేక వ్యాధుల నుండి కాపాడుతుంది.జింక్ మరియు ఇతర ఖనిజాలను కలిగి ఉండటం వల్ల ఈ డ్రింక్ రోగనిరోధక శక్తి( Immunity )ని పెంచడంలో సహాయపడుతుంది.
మితంగా ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.మరియు మలబద్ధకం వంటి జీర్ణ రుగ్మతలను నివారించవచ్చు.
అంతేకాకుండా ఈ డ్రింక్ పొటాషియం యొక్క మంచి మూలం.పొటాషియం కంటెంట్ గుండె పని తీరు మరియు రక్తపోటును నియంత్రించడంలో అద్భుతంగా తోడ్పడుతుంది.