వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని కుట్ర చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.వాలంటీర్ వ్యవస్థ మీద కావాలనే కుట్ర పూరితంగా బురద జల్లుతున్నారన్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాంగూల్మాలను తీర్పులా భావిస్తున్నారన్నారు.విపక్ష పార్టీ నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు స్వరాష్ట్రంలో ఇల్లు కూడా లేదన్నారు.
ఏపీలో ఎన్నికల తరువాత చంద్రబాబు, పవన్ తమ శాశ్వత నివాసాలకు వెళ్లిపోతారని చెప్పారు.పవన్, చంద్రబాబు విడిగా జీవిస్తున్న కలిసే ఉన్నట్లని ఆయన ఎద్దేవా చేశారు.
ఏపీలో మళ్లీ వైఎస్ జగనే అధికారంలోకి వస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.