హైదరాబాద్;వైద్య మౌలిక వసతులు కల్పించడమే భారత దేశన్ని తీర్చిదిద్దడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.ఈ మేరకు సోమవారం అమీర్పేట్ లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన బిజెపి కార్యకర్తలతో కలిసి సందర్శించారు.
అనంతరం అక్కడి రోగులు కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ.
కరోనా నేపథ్యంలో ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురి అయ్యారని అన్నారు.దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకూడదని దేశం లోని ప్రతి జిల్లా కేంద్రంలో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
ఇప్పటికే ప్రతి జిల్లాలో దాదాపు 70% వర్కు పూర్తి చేస్తుందని అన్నారు. హైదరాబాద్ మహానగరంలో 150 వెల్నెస్ కేంద్రాలకు నిధులు కేటాయించామని అన్నారు.
దానిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బస్తీ దవాఖాన ల పేరుతో పెట్టుకున్నారని తెలిపారు.వైద్య మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.
దీనిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది వందల కోట్ల నిధులతో ప్రతి దావకాన లు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు.బీబీనగర్ నిమ్స్ హాస్పిటల్ కు ఎనిమిది వందల కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.