పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టిన యంగ్ హీరో...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాలు మరొక హీరో చేసి సూపర్ సక్సెస్ చేసుకోవడం అనేది మనం చాలాసార్లు చూశాం.

అందులో భాగంగానే కొంతమంది ఆ సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకుంటే మరి కొంతమంది డిజాస్టర్లను మూట గట్టుకుంటు ఉంటారు.

అయితే ఇక్కడ జడ్జిమెంట్ అనేది చాలా కీలకపాత్ర వహిస్తుందనే విషయం మనకు తెలిసిందే.

అందువల్లే ఒక స్టోరీ విన్న తర్వాత అది ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనేది హీరో ఆ స్టోరీని అంచనా వేయలేకపోతే అది మంచి స్టోరీ అయితే మాత్రం తను చాలా నష్టపోతాడు.అది ఫ్లాప్ అయ్యే స్టోరీ అయితే తనని తాను సేవ్ చేసుకున్న వాడవుతాడు.ఇక మొత్తానికైతే ఇక్కడ జడ్జిమెంట్ అనేది కీలకపాత్ర వహిస్తుందనే చెప్పాలి.

అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) రిజెక్ట్ చేసిన సినిమాలతో సక్సెస్ అందుకున్న ఇక యంగ్ హీరో స్టార్ హీరోగా మారిపోయాడనే విషయం మనలో చాలామందికి తెలియదు.ఆయన ఎవరు అంటే పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్పుకునే నితిన్.

Advertisement

పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన రెండు సినిమాలను చేసి మంచి విజయాలు అందుకున్నాడు.

అందులో మొదటిది త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అఆ సినిమా కాగా, రెండవది కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ఇద్దరు కలిసి నిర్మించిన చల్ మోహన్ రంగా( Chal Mohan Ranga ) అయితే ఈ రెండు సినిమాలు మొదట పవన్ కళ్యాణ్ తో చేయాలని త్రివిక్రమ్ శ్రీనివాస్ భావించాడు.కానీ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలు తనకు సెట్ అవ్వవనే ఉద్దేశంతో వాటిని రిజెక్ట్ చేయడంతో వాటిని నితిన్ తో చేయాల్సి వస్తుంది.అందులో అఆ సినిమా సూపర్ హిట్ అవ్వగా, చల్ మోహన్ రంగ మాత్రం ఆవరేజ్ గా ఆడింది.

Advertisement

తాజా వార్తలు