రఘురామ పై వేటు .. ఆసక్తి చూపించని వైసీపీ ? 

మొన్నటి వరకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై అనర్హత వేటు వేయించేందుకు ఎంతగానో ప్రయత్నాలు చేశారు.వైసీపీ ఎంపీలంతా ఢిల్లీకి వెళ్లి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ను అనేక మార్లు కలిసి రఘురామ పై అనర్హత వేటు వేయాలని కోరారు.

 The Ycp Ignored The Issue Of Disqualification Hunting On Raghuram Krishna Raju Y-TeluguStop.com

జగన్ సైతం కేంద్ర బిజెపి పెద్దలను కలిసి ఇదే విషయమై ఫిర్యాదు చేశారు.అయినా రఘురామ విషయంలో కేంద్రం పెద్దగా పట్టించుకోనట్లు గా వ్యవహరిస్తూ వచ్చింది.

దీంతో విసుగు చెందిన జగన్ ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే రఘురామ పై అనర్హత వేటు విషయమై  గట్టిగా పట్టుబట్టాలని, ఏదో ఒకరకంగా రఘురామ పై వేటు వేయించాలని వైసీపీ భావించింది.ఈ మేరకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గట్టిగానే దీనిపై పట్టు పట్టాలని చూసారు.

      అయితే పార్లమెంట్ సమావేశాల్లో వైసీపీ అనూహ్యంగా సైలెంట్ అయిపోయింది.రఘురామ విషయాన్ని ప్రస్తావించేందుకు ఇష్టపడలేదు.దీంతో అసలు ఈ వ్యవహారాన్ని వైసీపీ ఎందుకు పక్కనపెట్టింది అనే సందేహాలు ఎన్నో కలుగుతున్నాయి.అయితే వైసీపీ సైలెంట్ వెనుక బిజెపి పెద్దలు ఉన్నారని, ప్రస్తుతం పెనగస్వ్యవహారంపై పార్లమెంట్ లో దుమారం రేగుతుండడంతో బిజెపి ప్రభుత్వం చిక్కుల్లో పడింది అని, ఇటువంటి సమయంలో రఘురామ వ్యవహారం పై పట్టుబడితే మరింత గందరగోళం గా మారుతుంది అని , అది నచ్చకే బిజెపి పెద్దలు ఒత్తిడి చేయడం తో వైసిపి వెనక్కి తగ్గినట్టుగా ప్రచారం జరుగుతోంది.

పార్లమెంట్ సమావేశాలకు ఇంకా రెండు రోజులు సమయం ఉంది.ఈ సమయంలో రఘురామ పై వేటు వేసేందుకు బిజెపి కూడా ఆసక్తి చూపించడం లేదు.

పైగా  కేంద్ర బీజేపీ పెద్దలు రఘురామ ను ప్రోత్సహిస్తున్నట్లు గా, ఆయనకు అపాయింట్మెంట్ లు ఇస్తుండటంతో వైసీపీ తీవ్ర ఆగ్రహంగా ఉంది.
   

Telugu Ap Cm Jagan, Central, Mp Raghurama, Ysrcp, Ysrcp Rebal Mp-Telugu Politica

 అయినా, బీజేపీ పై ఒత్తిడి పెంచలేక వైసిపిపోతోంది.ఎట్టి పరిస్థితుల్లోనూ పార్లమెంట్ సమావేశాల్లోనే రఘురామ ప్రైవేటు వేయించాలని చూసి వైసీపీ ఇప్పుడు సైలెంట్ అయిపోవడం వెనుక కేంద్ర బిజెపి పెద్దలు ఉన్నారనే విషయం వెల్లడైంది.ఇప్పుడు వైసిపి ఆయనపై చర్యలు తీసుకునేలా చేయలేకపోతే, రఘురాము మరింత దూకుడు పెంచి వైసీపీ ప్రభుత్వాన్ని జగన్ ను ఇరుకున పెట్టే అవకాశం లేకపోలేదు.

ఏది ఏమైనా రఘురామ వ్యవహారంలో వైసీపీ ఒక్కసారిగా ఇలా సైలెంట్ అయిపోవడం చర్చనీయాంశం గా మారింది.   

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube