1.అంతరిక్ష యాత్రకు టికెట్ల విక్రయం
అంతరిక్ష యాత్ర చేపట్టేందుకు టికెట్ల విక్రయం ప్రారంభం అయ్యింది.టికెట్ ధరను 33 కోట్లుగా నిర్ణయించారు.వర్జిన్ గెలక్టక్ సంస్థ దీనికి శ్రీకారం చుట్టింది.
2.11 వరకే రైతు బీమా దరఖాస్తులు
తెలంగాణలో ఎప్పుడు వరకు రైతు బీమా కు దరఖాస్తు చేసుకోని రైతులు, కొత్త పట్టాదారు పొందిన రైతులకు , ఈ నెల 3వ తేదీ లోపు రిజిస్టర్ చేసుకున్న రైతులు ఈ నెల 11వ తేదీ లోపు దరఖాస్తు సమర్పించాలని వ్యవసాయ శాఖ అధికారులు ప్రకటించారు.
3.సాగు చట్టాలను రద్దు చేయాల్సిందే
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న రైతులకు కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ సంఘీభావం తెలిపారు. నూతన వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేయాల్సిందేనని, ఇందులో మరో మాట కు తావు లేదని రాహుల్ వ్యాఖ్యానించారు.
4.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 44,643 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
5.కియా కారుకి క్యాష్ డిస్కౌంట్
దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ భారీ డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది.కియా కార్నివాల్ ఎంపీవి కారు కొనుగోలుపై 2.50 లక్షల క్యాష్ డిస్కౌంట్ ప్రకటించింది.
6.భారత్ లో ‘ ఈటా ‘ వైరస్
మంగుళూరులోని ఓ వ్యక్తిలో ఈటా వాటర్ వైరస్ రకాన్ని గుర్తించినట్లు వైద్యులు తెలిపారు.బ్రిటన్ లో తొలిసారిగా గుర్తించిన వేట వేరే ఇప్పుడు భారత్ లో వెలుగు చూడడం కలకలం రేపుతోంది.
7.కెసిఆర్ కు నరసింహులు ప్రశంస
సీఎం కేసీఆర్ పై మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ప్రశంసలు కురిపించారు.రాబోయే రోజుల్లో అంబేద్కర్ వారసుడిగా కేసీఆర్ మిగిలిపోతారు అంటూ వ్యాఖ్యానించారు.
8.విద్యుదాఘాతంతో చిరుతపులి మృతి
తెలంగాణలోని నారాయణపేట మండలం అటవీ ప్రాంతంలో ఓ చిరుతపులి విద్యుదాఘాతంతో మృతి చెందింది.బైరం కొండ గ్రామ రైతు తన పంట పొలానికి రక్షణగా విద్యుత్ కంచెను ఏర్పాటు చేశారు.అటవీ ప్రాంతం సమీపంలో ఉండడంతో చిరుత రక్షణ కోసం వేసిన విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది.
9.కెసిఆర్ పై షర్మిల విమర్శలు
కెసిఆర్ పై ట్విట్టర్ వేదికగా వైఎస్సార్ టిడిపి అధినేత షర్మిల విమర్శలు చేశారు.కెసిఆర్ భూములు అమ్మే ఆశ చావదు.పైసల మీద దాహం చావదని వ్యాఖ్యానించారు.‘ ఆమె భూములు తెలంగాణ ప్రజల భూములా ? కల్వకుంట్ల వారి భూములా అంటూ ప్రశ్నించారు.
10.దళిత బంధు పథకం పై హైకోర్టులో పిటిషన్
దళిత బంధు పథకం పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.దళిత బంధు కోసం ప్రభుత్వం 7 కోట్ల 60 లక్షల రూపాయలు విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ ను పిటిషనర్ తరఫు న్యాయవాది సుంకర నరేష్ దాఖలు చేశారు.
11.9 లోగా చేరకపోతే సీటు రద్దు
దోస్త్ మొదటి జాబితాలో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 9వ తేదీ లోపు ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని అధికారులు తెలిపారు.అలా చేయని విద్యార్థులకు కేటాయించిన సీటు రద్దు అవుతుందని స్పష్టం చేశారు.
12.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.గురువారం తిరుమల శ్రీవారిని 20,575 మంది భక్తులు దర్శించుకున్నారు.
13.నేడు మహిళా గో పాదయాత్ర
గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరుతూ యువతులసి పౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా గో పాదయాత్ర నేటి ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్ మెంట్ కాంపౌండ్ శ్రీ త్రిశక్తి హనుమాన్ దేవస్థానం నుంచి చిలుకూరు బాలాజీ ఆలయం వరకు కొనసాగుతున్నట్లు ఫౌండేషన్ చైర్మన్, టీటీడీ పాలక మండలి సభ్యుడు కొలిశెట్టి శివకుమార్ తెలిపారు.
14.ఓటర్ జాబితా సవరణ కు ప్రత్యేక షెడ్యూల్
వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు అందరికీ ఓటు హక్కు కల్పించాలని భారత ఎన్నికల సంఘం నిర్ణయించింది.దీనిలో భాగంగానే వాటర్ జాబితా సవరణ కు ప్రత్యేక షెడ్యూల్ ను ప్రకటించింది.
ఈ మేరకు తెలంగాణ సీఈఓ శశాంక్ గోయల్ దీనిపై ప్రకటన విడుదల చేశారు.ఈ ఏడాది నవంబర్ 1 నుంచి 30 వరకు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.
15.నేడు 10వ తరగతి ఫలితాలు
పదో తరగతి ఫలితాలు ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేయనున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.
16.వివేకా హత్య కేసు
మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది పులివెందుల కోర్టుల సునీల్ కస్టడీపై సీబీఐ విచారణను నిర్వహిస్తోంది.
17.రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరు మార్పు
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారం పేరును కేంద్రం మార్చింది .ఇకపై దీనిని ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం అని పిలుస్తారు.
18.ఎర్రకోట పరిసరాల్లో భారీ కంటైనర్ల తో బ్రద్రత
స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు.సాధారణ ప్రజలను ఈ ప్రాంతానికి అనుమతించడం లేదు.ఎర్రకోట ప్రధాన ద్వారం వద్ద దారికి అడ్డంగా భారీ కంటైనర్లను ఏర్పాటు చేశారు.
19.కోవాగ్జిన్ కు జిఎంపీ సర్టిఫికెట్
తాము అభివృద్ధి చేసిన టీకాకు హంగరీ నుంచి ఉత్తమ తయారీ విధానాలు అమలు ( జీఎంపి) ధ్రువీకరణ లభించినట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,700 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర – 47,700
.