Allu Aravind : ఆ పాత్ర మీ బావ చేస్తాడా అంటూ అల్లు అరవింద్ కి కౌంటర్ వేసిన స్టార్ హీరో…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు.ఇక అందులో స్టైలిష్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ ఒకరు.

 The Star Hero Countered Allu Aravind By Saying That His Brother In Law Will Do-TeluguStop.com

అయితే అల్లు అర్జున్ హీరోగా చాలా సినిమాలు వచ్చాయి.ఇక అల్లు అర్జున్ వాళ్ళ ఫాదర్ అయిన అల్లు అరవింద్( Allu Aravind ) గీతా ఆర్ట్స్ సంస్థని స్థాపించి దాని ద్వారా చాలా సినిమాలను నిర్మించిన విషయం మనకు తెలిసిందే.

ఇక ఇదిలా ఉంటే గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్, ఆ తర్వాత ఆర్య సినిమాతో యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు.

 The Star Hero Countered Allu Aravind By Saying That His Brother In Law Will Do-TeluguStop.com
Telugu Allu Aravind, Bunny, Chiranjeevi, Mammootty, Role, Sarathkumar, Medai-Mov

ఇక ఆ తర్వాత బన్నీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు.ఇక ఇదిలా ఉంటే బన్ని సినిమాలో అల్లు అర్జున్ ఫాదర్ గా శరత్ కుమార్( Sarathkumar ) నటించాడు.ఆ పాత్రలో శరత్ కుమార్ ఒదిగిపోయి నటించడమే కాకుండా ఆ సినిమా సక్సెస్ లో చాలావరకు ముఖ్యపాత్ర పోషించాడనే చెప్పాలి.

అయితే ముందుగా ఈ పాత్ర కోసం మలయాళ సూపర్ స్టార్ అయిన మమ్ముట్టిని( Mammootty ) అల్లు అరవింద్ అడిగినట్టుగా అప్పట్లో చాలా వార్తలైతే వచ్చాయి.దానికి మమ్ముట్టి కూడా అల్లు అరవింద్ కి అదిరిపోయే ఆన్సర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.

అది ఏంటి అంటే అల్లు అరవింద్ వెళ్లి మమ్ముట్టితో ఒకటి పాత్ర ఉంది అది మీరే చేయాలి అని చెప్పి బన్నీ లో శరత్ కుమార్ పాత్ర గురించి వివరించడట.

Telugu Allu Aravind, Bunny, Chiranjeevi, Mammootty, Role, Sarathkumar, Medai-Mov

దాంతో మమ్ముట్టి అలాంటి పాత్రలో నన్ను చేస్తావా, అని అడిగే ముందు మీ బావ అయిన చిరంజీవిని అడిగి ఉంటే బాగుండేది.ఆ క్యారెక్టర్ ఆయన చేసే అంత ఇంపార్టెంట్ ది అయితే నేను కూడా చేస్తాను అని చెప్పారట.దాంతో అల్లు అరవింద్ ఏం మాట్లాడాలో తెలియక కామ్ గా ఉండిపోయారట.

నిజానికి మమ్ముట్టి పోషించే అంత గొప్ప క్యారెక్టర్ అయితే కాదు.శరత్ కుమార్ తనకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు అంటూ ఆ విషయం తెలుసుకున్న ట్రేడ్ పండితులు సైతం అల్లు అరవింద్ మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube