తాలిబాన్ లకు వ్యతిరేకంగా లైవ్ లో సర్టిఫికెట్ చింపేసిన ప్రొఫెసర్..!!

ఆఫ్ఘనిస్తాన్ దేశంలో తాలిబాన్ సామ్రాజ్యం నెలకొన్న సంగతి తెలిసిందే.దాదాపు 20 సంవత్సరాల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చిన తాలిబాన్ లు తీసుకొస్తున్న చట్టాలు సంచలనంగా మారుతున్నాయి.

 The Professor Who Tore The Certificate Live Against The Taliban , Afghanistan, T-TeluguStop.com

ఈ చట్టాలు అతి భయంకరం కావడంతో… చాలామంది దేశం విడిచి పారిపోయారు.ఇదిలా ఉంటే ఆడవాళ్ళపై కఠిన ఆంక్షలు విధిస్తూ చదువుకు దూరం చేయటంతో పాటు ఉద్యోగం కూడా చేయకూడదని తాలిబాన్ లు  వ్యవహరిస్తున్న తీరుపై ఓ ప్రొఫెసర్ లైవ్ డిబేట్ కార్యక్రమంలో సీరియస్ అయ్యారు.

కాబుల్ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ లైవ్ డిబేట్ కార్యక్రమంలో తన డిగ్రీ పట్టా సర్టిఫికెట్ చింపేశారు.“నాకు డిగ్రీలు అవసరం లేదు.నా తల్లులు, సోదరీమణులు చదవలేకపోతే… ఈ విద్యను నేను అంగీకరించను.అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇదే రీతిలో ఆడవాళ్లపై తాలిబాన్ లు కఠిన చట్టాలు తీసుకొచ్చారు.అయితే ఆ తర్వాత ప్రజాస్వామ్యం పరంగా ప్రభుత్వం ఏర్పడటంతో… ఆడవాళ్లు యధావిధిగా ఉన్నత చదువులు చదువుతూ మరోపక్క ఉద్యోగం చేసుకోవడం జరిగింది.

కానీ ఇప్పుడు మళ్లీ తాలిబాన్ లు దేశాన్ని పరిపాలిస్తూ ఉండటంతో ఆడవాళ్ళపై విధిస్తున్న ఆంక్షలు సంచలనంగా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube