ఈ ఐఫోన్ ప్రైస్ అక్షరాలా రూ.12 లక్షలు.. ఇంతకీ దీని స్పెషల్ ఏంటంటే..

టెక్ దిగ్గజం యాపిల్ ఇప్పటి వరకు తీసుకొచ్చిన ఐఫోన్లలో ఏవీ కూడా రూ.1.5 లక్షల ధర దాటలేదు.కానీ ఐఫోన్ 14 మ్యాక్స్ ప్రో ధర రూ.12 లక్షలు అయ్యింది.అయితే ఇది నార్మల్ ఐఫోన్ 14 మ్యాక్స్ ప్రో కాదు.

 The Price Of This Iphone Is Literally Rs. 12 Lakhs So What Is Special About It-TeluguStop.com

నార్మల్ ఐఫోన్‌తో పోలిస్తే దీని డిజైన్ కాస్త గొప్పగా ఉంటుంది.నిజానికి దీని టాప్ వేరియంట్ ఒరిజినల్ ప్రైస్ రూ.1,39,900.మరి రూ.12 లక్షలు ధర ఏంటి? దీనికున్న ప్రత్యేకత ఏంటి? తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇటీవల రష్యాకు చెందిన కేవియర్‌ కంపెనీ ఐఫోన్ 14 ప్రో మోడల్ ఫోన్‌లను కొత్త డిజైన్లతో తీసుకొచ్చింది.

లిమిటెడ్‌ ఎడిషన్‌గా దొరికే వీటి డిజైన్ చాలా బాగుంటుంది.ఆ ఒక్క డిజైన్ కారణంగానే వీటి ధరలు ఆకాశాన్నంటుతాయి.కాగా ‘కేవియర్‌ టూర్బిలియన్‌ కార్బన్‌ గోల్డ్‌ యాపిల్‌ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌‘ ధర ఎవరూ ఊహించని రేంజ్‌లో ఉంది.ఈ మోడల్ ధర 14,150 డాలర్లగా కంపెనీ నిర్ణయించింది.మన కరెన్సీలో చెప్పుకుంటే దాదాపు రూ.12 లక్షలు.ఇంత మొత్తంతో 8 ఐఫోన్లు కొనుక్కోవచ్చు.

Telugu Expensive Phone, Iphone, Latest, Tech-Latest News - Telugu

ఇక కేవియర్‌ టూర్బిలియన్‌ కార్బన్‌ గోల్డ్‌ యాపిల్‌ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ ప్రత్యేకతల గురించి తెలుసుకుంటే.స్పెషల్ డిజైన్‌తో మాత్రమే ఇది కొత్తగా వస్తుంది.దీనిలోని ఫోన్ కేస్‌ను కార్బన్‌ ఉపయోగించి త్రీడీ ప్రింట్‌తో తయారుచేసి అందించారు.

ఫోన్ బాక్‌సైడ్‌లో రోలెక్స్‌ కంపెనీ స్పెషల్‌గా డిజైన్ చేసిన క్లాసికల్‌ టూర్బిలియన్‌ వాచ్‌ను ఫిక్స్ చేశారు.అంతేకాదండోయ్, ఈ వాచ్ బంగారు రంగులో మిలమిల మెరిసిపోతుంది.వాచ్‌ మెకానిజమ్‌లోనే అత్యుత్తమమైనదిగా పరిగణించే టూర్బిలియన్‌ మెకానిజమ్‌ను ఈ వాచ్‌లో ఆఫర్ చేయడం విశేషం.ఈ వాచ్‌లోని లోపలి పార్ట్స్‌ కదలికలు కూడా స్పష్టంగా బయటికి కనిపిస్తాయి.

ఈ వేరియంట్‌లో కేవలం 39 ఫోన్లను మాత్రమే డిజైన్ చేశామని కేవియర్ సంస్థ వెల్లడించింది.ఆసక్తి ఉన్నవారు ఈ ఖరీదైన ఐఫోన్‌ను కేవియర్‌ వెబ్‌సైట్‌ ద్వారా కొనచ్చు.

నార్మల్ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లో ఉన్న ఫీచర్లే అందులో కూడా ఉంటాయి కాబట్టి డిజైన్ కోసమే ఈ ధర పెరిగిందని చెప్పుకోవాలి.ఐఫోన్ 14 మ్యాక్స్‌ ప్రోలో ఏ15 బయోనిక్‌ ప్రాసెసర్‌, 6.7 అంగుళాల డిస్‌ప్లే ఆఫర్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube