జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి సిదిరి అప్పలరాజు తీవ్రంగా మండిపడ్డారు.పవన్ ఎమ్మెల్యేగా గెలవడానికి తిరుగుతున్నారా? లేక జనసేన అభ్యర్థులను గెలిపించేందుకు తిరుగుతున్నారా అని ప్రశ్నించారు.
ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో పవన్ నిర్ణయించుకోవాలని మంత్రి సిదిరి సూచించారు.సీఎం పదవి ప్రజలు ఇవ్వాలి తప్ప ముష్టి అడిగితే వచ్చేది కాదని చెప్పారు.
వారాహి యాత్ర అసంబద్ధమైన యాత్రని తెలిపారు.చెప్పులు పోవడం కాదన్న ఆయన ముందు మీ పార్టీ గుర్తు పోయిందని పేర్కొన్నారు.
ఈసీ ఎవరికి కేటాయించిందో వెతుక్కోవాలని తెలిపారు.మూడు పార్టీలు తెర వెనుక కలిసే సంసారం చేస్తున్నాయన్న మంత్రి సిదిరి అన్ని చోట్ల వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.