తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళి సైల మధ్య జరుగుతున్న వివాదం హస్తినకు చేరింది

మొత్తానికి తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళి సైల మధ్య జరుగుతున్న వివాదం హస్తినకు చేరింది.నేడు ప్రధాని మోదీని తెలంగాణ గవర్నర్ తమిళిసై కలిశారు.

 The Ongoing Dispute Between Telangana Cm Kcr And Governor Tamil Sai Has Reached-TeluguStop.com

తెలంగాణలో ప్రొటోకాల్ వివాదంపై ప్రధానికి ఫిర్యాదు చేశారు.ఇటీవల గవర్నర్ ప్రసంగం లేకుండానే.

అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.అనేక విషయాల్లో అసలు తనను పట్టించుకోలేదని తమిళిసై వివరించారు.

అనంతరం తమిళిసై మీడియాతో మాట్లాడుతూ.వ్యాక్సినేషన్‌పై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపా.పుదుచ్చేరి-తెలంగాణ మధ్య నేరుగా విమాన సర్వీసులు నడపాలని కోరాను.తెలంగాణలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు.

నేను వివాదాస్పద వ్యక్తిని కాదు.ఫ్రెండ్లీ గవర్నర్‌ను.

నేను రాజ్యాంగబద్ధంగానే నడుచుకుంటా.రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదులు చేసేందుకు ప్రధానిని కలవలేదు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాలు పెంచాలని ప్రధానిని కోరా.నాపై తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపుతోంది.

మహిళా గవర్నర్‌ను అవమానిస్తున్నారు.గవర్నర్‌కు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదు.

ప్రొటోకాల్ పాటించాల్సిన బాధ్యత సీఎస్‌కు ఉంది.వ్యక్తిని కాకుండా వ్యవస్థను పరిగణనలోకి తీసుకోవాలి.రాజ్యాంగాన్ని, వ్యవస్థలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాలి.గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకంలో వివాదమేమీ లేదు.

కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు.ప్రభుత్వం సూచించిన వ్యక్తి ఎలాంటి సేవ చేయలేదని నేను భావించా.

నా అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పా.కౌశిక్‌రెడ్డి పేరు సిఫారసుపై నేను సంతృప్తి చెందలేదు.

అందుకే ఆ ఫైల్‌ను పెండింగ్‌లో పెట్టాల్సి వచ్చింది.కొన్ని కారణాలను సాకుగా చూపి.

గవర్నర్ కార్యాలయాన్ని అవమానించడం సరికాదు.నేను ఏ విషయంలో రాజకీయాలు చేశానో బయటపెట్టాలి.

సీఎం ఏ విషయంపై అయినా నాతో నేరుగా వచ్చి చర్చించవచ్చు అని పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube