సాధారణంగా గుర్రాలు( Horse ) చాలా అందంగా ఉంటాయి.వాటన్నిటిలో అత్యంత అందమైన ఒక గుర్రం తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇది అఖల్-టేకే( Akhal-Teke Horse ) అనే అరుదైన, అద్భుతమైన గుర్రపు జాతికి చెందింది.ఈ గుర్రం సూర్యుని కాంతిలో షైనీ గోల్డెన్ సిల్వర్ జుట్టుతో ఇంటర్నెట్ యూజర్లను ఆకర్షిస్తోంది.
ఈ జాతి తుర్క్మెనిస్తాన్లోని( Turkmenistan ) కరాకుమ్ ఎడారికి చెందినది.ఈ గుర్రంలో చురుకుదనం, తెలివితేటలు ఎక్కువ.
అయితే ఎడారి పరిస్థితులకు ఇది అనుగుణంగా ఉంటుంది.
ట్విట్టర్లో గాబ్రియెల్ కార్నో అనే యూజర్ షేర్ చేసిన వీడియోలో అఖల్-టేకే గుర్రం తన అద్భుతమైన అందం, గోల్డెన్ కలర్ హెయిర్ చూపుతుంది.
ఈ వీడియోకు లక్ష దాకా వ్యూస్ వచ్చాయి.ఇది చూసినవారు గుర్రాన్ని ప్రశంసిస్తూ అనేక వ్యాఖ్యలు చేశారు.“ఇది అరుదైన అఖల్-టేకే తుర్క్మెన్ గుర్రపు జాతికి చెందినది.షైనీ కోటు వల్ల వీటిని గోల్డెన్ హార్స్( Golden Horse ) అనే నిక్ నేమ్ తో పిలుస్తారు.” అని క్యాప్షన్ జోడించారు.
అఖల్-టేకే జాతి ప్రపంచంలోని పురాతన, స్వచ్ఛమైన గుర్రపు జాతులలో ఒకటి, ఇవి క్రీస్తుపూర్వం 3,000 కాలం నుంచే ఉన్నాయని అంటారు.ఇది అరేబియా గుర్రానికి( Arabian Horse ) సంబంధించినదని నమ్ముతారు. 1.6-1.65 మీటర్ల ఎత్తుతో సన్నని, సొగసైన శరీరాకృతితో ఇవి చాలా అందంగా కనిపిస్తాయి.ఈ జాతి వేగంగా పరిగెత్తుతాయి.చాలా బలం కలిగి ఉంటాయి.దాని యజమాని పట్ల చాలా విశ్వాసాన్ని కనబరిస్తాయి.అఖల్-టేకే గుర్రాలు కొనడం కూడా కష్టమే.
ఎందుకంటే ఇవి చాలా ఖరీదైనవి.భారతదేశంలో ఒక్కొక్క గుర్రం కనీసం రూ.30 లక్షల వరకు ఉంటుంది.అవి చాలా అరుదు కాబట్టి ధర కూడా ఎక్కువే ఉంటుంది.
ఈ జాతికి చెందిన గుర్రాలు ప్రపంచవ్యాప్తంగా 7,000 కంటే తక్కువ ఉన్నాయి.
1924లో, అష్కాబాద్లో సంభవించిన వినాశకరమైన భూకంపం అనేక అఖల్-టేకే గుర్రాలు, వాటి యజమానులను చంపింది.1950లలో, రష్యన్లు మాంసం కోసం ఈ జాతిని వధించాలని భావించారు, కానీ తుర్క్మెన్ గుర్రపు సైనికుల బృందం వాటిని ఎడారిలో దాచిపెట్టి వారిని రక్షించింది.సంతానోత్పత్తి, వైవిధ్యం లేకపోవడం వల్ల ఈ జాతి జన్యుపరమైన సమస్యలను కూడా ఎదుర్కొంది.
నేడు, ఈ జాతిని తుర్క్మెన్ ప్రభుత్వం, అంతర్జాతీయ సంస్థలు రక్షిస్తున్నాయి.దాని ప్రత్యేక లక్షణాలు, వారసత్వాన్ని సంరక్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.