ఎస్సైపై కత్తితో దాడి చేసిన వ్యక్తి.. షాకింగ్ వీడియో వైరల్...

కుటుంబ సభ్యుల్లో ఆస్తి తగాదాలు చేలరేగిన ఘటనలు కోకొల్లలు.అయితే తాజాగా ఇద్దరు అన్నదమ్ముల మధ్య కూడా ఆస్తి తగాదాలు ఏర్పడ్డాయి.

 The Man Who Attacked Essay With A Knife Shocking Video Goes Viral , Si , Attack-TeluguStop.com

అయితే వీరి తగాదా పోలీస్ స్టేషన్ వరకు చేరింది.ఈ కేసును టేకప్ చేసిన ఒక సబ్ ఇన్‌స్పెక్టర్ ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు.

కానీ అన్నదమ్ముల్లో తమ్ముడైన ఎల్లుం విలాయిల సుగతన్ మాత్రం ఎస్సై ఇచ్చిన తీర్పు పట్ల తీవ్ర అసంతృప్తి, కోపంతో రగిలిపోయాడు.ఈ ఎస్సై తనకి కాకుండా తన సోదరుడికి సపోర్ట్ చేశారని పగ కూడా పెంచుకున్నాడు.

అలా కక్షతో రగిలిపోయిన ఆ వ్యక్తి ఒక పిచ్చి పని చేశాడు.అతడు ఏకంగా ఎస్ఐ పైనే కత్తితో దాడికి యత్నించాడు.

అదృష్టం కొద్దీ, ఈ దాడి నుంచి ఎస్సై చాకచక్యంగా తప్పించుకున్నారు.ఈ హత్యాప్రయత్నం కేరళలోని అలప్పుజ జిల్లాలోని నూరనాడ్ పోలీసు స్టేషన్‌లో చోటు చేసుకుంది.

సబ్ ఇన్‌స్పెక్టర్ వీఆర్ అరుణ్ కుమార్‌ ని హతమార్చేందుకు సదరు సోదరుడు ఒక పెద్ద కత్తి పట్టుకొని యాక్టివా బండిపై జూన్ 10న పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాడు.అనంతరం స్టేషన్ బయట నిల్చొని ఎస్సై బయటికి రాగానే దాడి చేయాలనుకున్నాడు.

జీపులో ఎస్సై కనిపించగానే అతని వైపు కోపంగా చూస్తూ సుగతన్ కవ్వించే యత్నం చేశాడు.దీంతో జీపు దిగాడు ఎస్ఐ.అంతలోనే సుగతన్ కత్తితో దాడి చేసేందుకు శరవేగంగా ముందుకు వచ్చాడు.ఇది చూసిన ఎస్ఐ వెంటనే అప్రమత్తమయ్యారు.

అయితే ఆ సోదరుడు మాత్రం కత్తితో ఎస్సై మెడ నరికేందుకు బలంగా చేయి విసిరాడు.ఆ చేతిని ఎస్సై పట్టుకొని అతని కింద పడేశాడు.

ఈ క్రమంలో వీరిద్దరి మధ్య తీవ్రమైన పెనుగులాట జరిగింది.అంతేకాదు ఎస్సై చేతికి గాయం కూడా అయింది.అయినా ఇవేమీ లెక్కచేయకుండా అతని నుంచి ఎస్సై కత్తిని తీసుకున్నారు.ఇంతలోనే ఒక కానిస్టేబుల్ వచ్చి కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం దాడి చేసిన ఈ వ్యక్తిని జీపులో ఎక్కించి జైలుకి తరలించారు.ఆ తర్వాత ఎస్సై ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు.

దాడికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయ్యాయి.తాజాగా ఈ వీడియోని కేరళ పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube