ఆ ఊరి పేరుతో గ్రామస్తుల నరకయాతన..!

కొజ్జేపల్లి ఈ పేరు మా ఊరికే పెట్టాలా.మాకేంటీ ఖర్మ అంటూ ఆ గ్రామస్తులు మండిపడుతున్నారు.

 The Hellish Torture Of The Villagers In The Name Of That Village Village Name,-TeluguStop.com

ఇంతకీ ఏంటా కథా ఇక్కడ తెలుసుకోండి.కొంచము పెద్దవాళ్ళు పేర్లు లేదా పాతరము ఉంటే పిల్లలు ఒప్పుకోవడము లేదు పెద్దవాళ్ళతో గొడవపడుతున్నారు.

అలాంటిది అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని ఒక గ్రామం పేరు కొజ్జేపల్లి.దీంతో గ్రామస్తుల మానసిక వేదన వర్ణనాతీతం.

తమ గ్రామం పేరు మార్చండి అంటూ ఎక్కని ఆఫీసు లేదు.ఎన్నో అగచాట్లు పడ్డ తర్వాత ఊరు పేరు రికార్డులలో అయితే గాంధీనగర్ గా మారింది.

గానీ వ్యవహారంలో కొజ్జేపల్లి గానే మిగిలిపోయింది.

ఈ గ్రామానికి కొజ్జేపల్లి అనే పేరు రావడానికి రెండు రకాల కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.

కొన్ని ఏళ్లకు ముందు గ్రామంపై మరొక గ్రామం ప్రజలు ఏదో ఒక కారణం వల్ల దాడికి రాగా.గ్రామస్తులు ఊరు వదిలి దూరంగా వెళ్లి దాక్కున్నారట.

గుత్తి చెరువు సమీపంలో పూర్వం కొంతమంది హిజ్రాలు పూరి గుడిసెలు వేసుకుని నివసించేవారని., అందుకే ఆ గ్రామానికి ఆ పేరు వచ్చిందని మరో కథ సైతం స్థానికుల నోట వినిపిస్తుంది.

ఏది ఏమైనా ఇప్పటి ఆ గ్రామ యువత మాత్రం ఊరి పేరు వల్ల తమకు అవమాన భారంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇచ్చి, ప్రభుత్వకు వెళ్లి బాధను గ్రామస్తులు చెప్పుకోవడంతో ఊరు పేరైతే అయితే గాంధీనగర్ గా మార్పు చేస్తూ గెజిట్ విడుదల చేశారు.కానీ వ్యవహారాలలో మాత్రం కొజ్జేపల్లి అని చెబితే గాని ఊరును గుర్తుపట్టని పరిస్థితి ఉంది.ఊరిపేరు మార్చినప్పటికి కొత్త పేరుతో పాటు పాతపేరు రాయలిసిన పరిస్థితి ఉంది.

ప్రభుత్వం చర్యలు తీసుకొని ఊరు పేరు మార్పును ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని గ్రామ యువత భావిస్తున్నారు.

Unknown Facts about Kojjepalli Village Kojjepalli Story

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube