సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram Srinivas )కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడవ చిత్రం ‘గుంటూరు కారం’( Guntur Karam ).ఈ సినిమా ప్రారంభం నుండే అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయో మన అందరికీ తెలిసిందే.
మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ కి మార్కెట్ లో ఉన్నటువంటి క్రేజ్ అలాంటిది మరి.టైటిల్ కూడా ఫిక్స్ కాకముందే 150 కోట్ల రూపాయిల థియేట్రికల్ బిజినెస్ ని క్లోజ్ చేసుకున్న ఈ సినిమా పై ప్రస్తుతం మొదట్లో ఉన్న హైప్ మరియు క్రేజ్ అయితే లేదనే చెప్పాలి.కారణం రీసెంట్ గా విడుదలైన పాటలకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాకపోవడమే.మొదటి లిరికల్ వీడియో సాంగ్ కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది కానీ, రీసెంట్ గా విడుదలైన ‘ఓ మై బేబీ’ లిరికల్ వీడియో సాంగ్ కి మాత్రం దారుణమైన రెస్పాన్స్ వచ్చింది.
ఆ చిత్ర సంగీత దర్శకుడు థమన్ ట్విట్టర్ కి రావాలంటేనే భయపడుతున్నాడు ఫ్యాన్స్ దెబ్బకి.

ఇప్పుడు అతి త్వరలోనే మూడవ లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేయబోతున్నాం అని ఆ చిత్ర నిర్మాత తెలియచేసిన వెంటనే ఫ్యాన్స్ నుండి దారుణమైన రెస్పాన్స్ వచ్చింది.మీకు దండం పెడుతాం, సినిమాకి ఉన్న ఆ కాస్త క్రేజ్ ని కూడా చెడగొట్టకండి, దయచేసి థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చెయ్యండి, సినిమా మీద హైప్ ని పెంచండి అంటూ నిర్మాత నాగ వంశీ( Naga Vamsi ) ట్వీట్ క్రింద కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.థమన్ అందించే రొటీన్ మ్యూజిక్ వినడానికి చాలా రోతగా ఉందని, థమన్ కనిపిస్తే చితకబాదాలి అనేంత కోపం ఉందంటూ మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం పూర్తి అయ్యిందట.ఎల్లుండి నుండి తెరకెక్కబోయే చివరి పాటతో షూటింగ్ మొత్తం పూర్తి అవుతుందని ఆ చిత్ర నిర్మాత నాగవంశీ ఈ సందర్భంగా తెలిపాడు.

ఇది ఇలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31 న విడుదల చెయ్యబోతున్నారు అంటూ సోషల్ మీడియా లో నిన్న మొన్నటి వరకు టాక్ వినిపించింది.కానీ అందులో ఎలాంటి నిజం లేదని, జనవరి 7 వ తారీఖున ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే ట్రైలర్ లాంచ్ ఉంటుందని లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం.మహేష్ ఫ్యాన్స్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్న ఈ చిత్రం, అంచనాలను అందుకుంటుందా లేదా అనేది మరో 20 రోజుల్లో తెలియనుంది.