క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం పుష్ప.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.
ఇక ఈ సినిమా గత ఏడాది విడుదలైనప్పటికీ ఇంకా ఈ సినిమాకి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు.ఈ సినిమాకు ఇలాంటి పాపులారిటీ రావడానికి ఈ సినిమాలో పాటలు కూడా ముఖ్య కారణం అని చెప్పాలి.
ఇందులో శ్రీవల్లి, రారా సామి, ఐటమ్ సాంగ్ ఎంతో క్రేజ్ దక్కించుకున్నాయి.
ఇక ఇప్పటికి ఈ సినిమాలో పాటలకు రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ఇక ఈ సినిమాలో రష్మిక నటించిన రారా సామి అనే పాట మంచి క్రేజ్ సంపాదించుకుంది.
తాజాగా ఈ పాటకు ఒక స్కూల్లో చిన్నారి తన స్నేహితులతో కలిసి అద్భుతమైన డాన్స్ చేసింది.సినిమాలో రష్మిక చేసిన విధంగానే చిన్నారి కూడా రష్మిక హుక్ స్టెప్పులను దించేసిందని చెప్పాలి.
ఇక ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ వీడియో వైరల్ అయింది.
ఇక ఈ వీడియో చూసిన ఓ నెటిజన్ ఈ వీడియోనీ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.దీంతో ఈ వీడియో రష్మిక కంట పడటంతో ఈ వీడియో పై రష్మిక స్పందించారు.ఈ ట్వీట్‌ను రష్మిక రీట్వీట్ చేస్తూ.‘షి మేడ్ మై డే.ఈ రోజుకు ఇది చాలు.ఈ క్యూటీని కలవాలనుకుంటున్నా.ఎలా?’ అంటూ పాప అడ్రస్ కావాలని ఈమె కోరారు.ఈ విధంగా చిన్నారి డాన్స్ చూసిన రష్మిక ఏకంగా తనను కలవాలని అనుకుంటున్నాను అంటేనే ఆ చిన్నారి డాన్స్ ఎలా చేసిందో అర్థమవుతుంది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.