ఏపీలో ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర( CM Jagan Bus Yatra ) ప్రారంభం కానుందని మంత్రి రోజా( Minister Roja ) తెలిపారు.ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబుపై( Chandrababu ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఆమె 2014 లో గెలిచి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఏపీ అప్పుల పాలైందని విమర్శించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( PM Narendra Modi ) సభ తరువాత కూటమి పరాజయం ఖాయమైందని తెలిపారు.ఎన్నో ఏళ్లుగా పార్టీ జెండా మోసిన వాళ్లకే టీడీపీ సీటు ఇవ్వలేదని విమర్శించారు.జనసేన ప్రకటించబోతున్న 21 సీట్లలో పది మంది టీడీపీ నేతలే ఉంటారని వెల్లడించారు.