భారతదేశం విభిన్న జాతులకు, వైవిధ్యాలకు నిలయం.ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఆహార పదార్థాలు ఉంటాయి.
విదేశీయులు భారత దేశంలో విభిన్న ప్రాంతాలకు వెళ్తే ఆయా ప్రాంతాల్లోని రుచులను ఆస్వాదిస్తుంటారు.వాటి రుచికి మైమరిచిపోతుంటారు.
తాజాగా ఓ విదేశీ ప్రముఖుడు దోసె రుచికి మైమరిచి పోయాడు.భారతదేశంలోని బ్రిటీష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ ఇటీవల బెంగళూరులో పర్యటించారు.
అక్కడ మసాలా దోసెను తొలిసారి టేస్ట్ చేశారు.ఇతరుల మాదిరిగా స్పూన్ తో కాకుండా కేవలం చేతితోనే దానిని తిని భారతీయుల మనసును గెల్చుకున్నారు.
మైసూరులో మసాలా దోసను తింటున్న ఫొటోలను ఆయన తాజాగా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.భారతీయ వంటకాలను ప్రయత్నించడం, తన ట్వీట్లలో హిందీ, కన్నడ పదాలను ఉపయోగించడం వంటి చిన్న వీడియో దేశీ ప్రజలను ఆనందపరిచింది.ఆయన ట్విట్టర్‌లో ఒక పోల్‌ను పోస్ట్ చేశాడు.అక్కడ అతను తన ఉదయపు అల్పాహారాన్ని చేతులతో లేదా ఫోర్క్‌తో తినాలా అంటూ ఓటు వేయమని ప్రజల అభిప్రాయాన్ని అడిగాడు.
దీనికి మెజారిటీ ప్రజలు చేతితో తినడమే మంచిదని ఓటేశారు.భారతీయ ఆహారాన్ని ఆస్వాదించడానికి చేతులు ఉపయోగించడం ఉత్తమమైన మార్గం అని నెటిజన్లు పేర్కొన్నారు.అతను ప్రజల సూచనను స్వీకరించి, తన చేతులతో తినాలని నిర్ణయించుకున్నందుకు దేశీ నెటిజన్లు సంతోషిస్తున్నారు.మరికొందరు బ్రిటీష్ దౌత్యవేత్తకు భారతీయ సంప్రదాయ దుస్తులు, వివిధ రకాల ఆహారాలను సూచించారు.
భారతదేశంలోని బ్రిటీష్ హైకమిషనర్, అలెక్స్ ఎల్లిస్‌కు దేశంలోని వంటకాలు అంటే చాలా అభిమానం.దేశంలోని నగరాల్లో ప్రసిద్ధ ఆహారాలను తిని వాటి రుచికి మైమరిచిపోయే వారు.
భారతీయ వంటకాలు, మన సంప్రదాయం పట్ల ఆయన చూపుతున్న మక్కువకు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.