అద్భుతమైన విందు, మంచి సంగీతం, అతిథుల డ్యాన్స్‌లతో భారతీయ వివాహాలు ఒక పార్టీని తలపిస్తుంటాయి.ఇదే వేడుకలలో వరుడు, అతని భార్య చెల్లి మధ్య కూడా చూడముచ్చటైన ఆటపట్టింపులు ఉంటాయి.
ఇద్దరూ ఒకరిపై ఒకరు చిలిపి చేష్టలు చేసుకోవడం ఎప్పుడూ సరదాగానే ఉంటుంది.ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో బాగా హిట్ అవుతుంటాయి.
కాగా తాజాగా ఫన్‌టాప్( Funtop ) అనే ఇన్‌స్టాగ్రామ్ మీమ్ పేజీ ఈ తరహా వీడియోను షేర్ చేసింది.ఇందులో మరదలు, వరుడి మధ్య చిలిపి చేష్టలను మీరు చూడవచ్చు.
వీడియో ఓపెన్ చేయగానే మనకు వేదిక వద్ద వరుడిని స్వాగతించే మరదలు కనిపిస్తుంది.ఒక స్టేజ్‌పై నిలబడి, మరదలు వరుడికి( groom ) కొన్ని సీట్స్ అందిస్తున్నట్లు చూపిస్తుంది.మొదట, అతను తినడానికి ఆమె దానిని అతని నోటి దగ్గర పెట్టడం చూడవచ్చు, కానీ అతను ఆ స్వీట్ తిందామని ముందుకు రావడంతో ఆమె తన చేతిని వెనక్కి లాగుతుంది.తర్వాత వరుడు స్వీట్ తినడానికి తన మరదలు చేయి పట్టుకోవడం చూడవచ్చు.
కాగా ఆమె వెనుక నిలబడి ఉన్న వధువు( Bride ) స్క్వాడ్ చేతులు పట్టుకోకూడదని వరుడిపై అరవడం వినవచ్చు.దీని తరువాత, మరదలు వరుడిని నోరు తెరవమని కోరింది, ఆమె మరోసారి అతని ముందు స్వీట్ ఉంచింది.
కానీ ఈసారి మళ్లీ వరుడు దానిని తినలేకపోయాడు.మరదలు మాత్రం అతడికి చూపించిన సీట్‌ను తానే గుటుక్కున మింగింది.
దాంతో వరుడికి ఫ్యూజులు ఎగిరిపోయాయి.ఇదెక్కడి ప్రాణం రా బాబోయ్, వేదికపై పరువు తీసేసింది అనుకుంటూ వరుడు బాగా బాధపడిపోయాడు.
మరోవైపు అతిథులందరూ ఈ దృశ్యాన్ని చూసి బాగా నవ్వుకున్నారు.ఈ ఫన్నీ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.