మెస్సీనే చిటికలో మోసం చేసిన కుర్రాడు... వైరల్ సంగతి!

The Boy Who Cheated Lionel Messi In A Pinch Viral Thing, Lionel Messi, Football Player, Viral News, Trending News ,sports News, Julius Dein, Magic

ఫుట్​బాల్​ దిగ్గజం లియోనల్​ మెస్సీ గురించి తెలియని ఫుట్​బాల్ ప్రేమికులు ఉండరంటే నమ్మశక్యం కాదేమో.అతని ఆట తీరును అభిమనించే వారు ప్రపంచమంతటా వున్నారు.

 The Boy Who Cheated Lionel Messi In A Pinch Viral Thing, Lionel Messi, Footba-TeluguStop.com

ముఖ్యంగా అతని స్టైల్​కు జనాలు ఫిదా అవుతుంటారు.అయితే మైదానంలో తన ఆట తీరుతో మాయ చేసే మెస్సీనే తన మ్యాజిక్​తో బోల్తా కొట్టించాడు ఓ మెజీషియన్‌.

అవును, ఫిఫా ప్రపంచ కప్​లో విజయాన్ని సాధించిన తర్వాత ప్యారిస్‌ సెయింట్‌ జెర్మన్‌(పీఎస్​ జీ) అనే క్లబ్‌కు మెస్సీ ప్రాతినిధ్యం వహిస్తున్న క్రమంలో గురువారం రాత్రి PSG ప్లేయర్స్‌ కోసం ప్యారిస్‌లో ఓ పార్టీ నిర్వహించారు.

ఈ పార్టీకి మెస్సీతో పాటు ఇతర PSG ప్లేయర్లు చాలామంది హాజరయ్యారు.ఇదే పార్టీకి ‘జూలిస్‌ డెయిన్‌’ అనే మెజీషియన్‌ కూడా రావడం గమనార్హం.ఆయన మెస్సీ దగ్గరికి వచ్చి ఓ కార్డ్‌ ట్రిక్‌ ప్లే మ్యాజిక్‌ షో చూపిస్తానన్నాడు.

దానికి మెస్సీ సరే అనగా మెస్సీని ఒక కార్డు సెలెక్ట్‌ చేసుకోవాలని, అయితే అది ఏ కార్డు అనేది తనకు చూపించొద్దని చెప్పాడు.అలా మెస్సీ ఏస్‌(A) కార్డును సెలెక్ట్‌ చేసుకున్న ఆ తర్వాత తన మ్యాజిక్‌ ట్రిక్‌తో మెస్సీ ఎంచుకున్న కార్డును మెజీషియన్‌ కరెక్టుగా చూపించడంతో పాటు అర్థం కాని భాషలో మాట్లాడాడు.

ఇక సదరు మెజీషియన్‌ ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్న మాటలను విని మెస్సీ నవ్వుకున్నాడు.ఎందుకంటే అతనికి ఇంగ్లీష్ సరిగ్గా రాదు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్​చల్​ చేస్తోంది.ఇది చూసిన మెస్సీ ఫ్యాన్స్​ మెస్సీ ఇన్నోసెన్స్ చూసి మురిసిపోయారు.ఇకపోతే మెస్సీ ఫిఫా వరల్డ్‌కప్‌ అందించిన తర్వాత ఆటకు రిటైర్మెంట్‌ ఇస్తాడని అంతా భావించారు.కానీ మరికొన్ని రోజులు తన ఆటను కొనసాగిస్తానని మెస్సీ తన మనసులోని మాటను చెప్పగా అతని అభిమానులు చాలా సంతోషించారు.

అయితే గత రెండు రోజులుగా ఆయన త్వరలోనే రిటైర్మెంట్​ ప్రకటించనున్నట్లు పలు కథనాలు వస్తున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube