తెలంగాణలో ఎన్నికల( Telangana Elections ) ఘట్టం ఇంకా ముగియలేదు.ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది.
పార్టీ అభ్యర్థుల జాబితాలు విడుదలవుతున్నాయి. ఇక ఎన్నికల ప్రచారంపై అన్ని పార్టీలు దృష్టి సారించగా, తెలంగాణ కాంగ్రెస్ లో మాత్రం మరో కొత్త వ్యవహారం తెరపైకి వచ్చింది.
అప్పుడే ముఖ్యమంత్రి అభ్యర్థిని తానే అంటూ కొంతమంది నేతలు చేస్తున్న కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.కొద్దిరోజుల క్రితం భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తానే ముఖ్యమంత్రి అవుతాను అంటూ ప్రకటించి సంచలనం సృష్టించగా , తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డి సైతం ఇదేవిధంగా వ్యాఖ్యానిస్తున్నారు.
చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న జానారెడ్డి ఇప్పుడు స్పీడ్ పెంచారు.మీడియా సమావేశం నిర్వహించి అనేక స్టేట్మెంట్లు ఇస్తున్నారు.
తానే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని అని జానారెడ్డి ప్రకటించుకున్నారు.
జానారెడ్డి ( Jana Reddy )మాత్రమే కాదు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , సీఎల్పీ నేత మల్లు విక్రమార్క( Revanth Reddy )… ఇలా చెప్పుకుంటూ వెళితే చాలామంది సీనియర్ నాయకులు తమ సన్నిహితుల వద్దసీఎం అభ్యర్థి అంటూ చెప్పుకుంటూ బహిరంగంగా వ్యాఖ్యానించిన సంఘటనలు జరిగాయి. అసలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు స్వాతంత్రం ఎక్కువగా ఉంటుంది. పార్టీ అధికారంలో ఉన్నా, లేకపోయినా ఈ తరహా స్టేట్మెంట్లు కాంగ్రెస్ లో సర్వసాధారణం.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు నెలలకు ఒక ముఖ్యమంత్రి అంటూ రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్న ఆ విమర్శలను నిజం చేసే విధంగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతల స్టేట్మెంట్లు ఉంటున్నాయి.
పార్టీ కష్ట కాలంలో ఉన్న సమయంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న చాలామంది సీనియర్ నేతలు ఎన్నికల సమయంలో యాక్టివ్ అవ్వడమే కాక పార్టీ లో తాము ఎంత గొప్ప నాయకుడు చెప్పుకుంటూ తాము ముఖ్యమంత్రి అభ్యర్థి రేకులు ఉన్నట్లుగా ప్రకటించుకోవడం వంటివి సర్వసాధారణంగా మారిపోయాయి తమకు పార్టీ హై కమాండ్ వద్ద మంచి గుర్తింపు ఉందని , సీనియర్ నేత హోదాలో ముఖ్యమంత్రిగా అవకాశం కల్పిస్తారని స్టేట్మెంట్లు తరచుగా వినిపిస్తూ ఉంటాయి.ఈ తరహా లో నాయకులు స్టేట్మెంట్లు ఇస్తున్నా, ఆ పార్టీ హై కమాండ్ వీరిని కట్టడం చేసే ప్రయత్నం చేయడం లేదు .ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ బలం పెంచుకున్నట్లుగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనే సంకేతాలతో ఇప్పటివరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న నేతలంతా ఈ తరహా స్టేట్మెంట్లు ఇస్తూ తాము యాక్టివ్ గా ఉన్నాము అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.