ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షో బుల్లితెరపై మంచి రేటింగ్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ షో ద్వారా ఎంతోమందికి ఊహించని స్థాయిలో పాపులారిటీ దక్కింది.
ఈ షో వల్ల గాజువాక కండక్టర్ ఝాన్సీ, నెల్లూరు కవిత ప్రూవ్ చేసుకోవడంతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు దగ్గరయ్యారు.వాళ్లిద్దరికీ సోషల్ మీడియాలో కూడా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.
నెల్లూరు కవిత ఒకటి రెండు ఎపిసోడ్లకు మాత్రమే పరిమితం కాగా ఝాన్సీ మాత్రం జబర్దస్త్ షో ఎపిసోడ్లలో కూడా కనిపించి సందడి చేశారు.అయితే ఈ మధ్య కాలంలో వీళ్లిద్దరూ ఈటీవీ షోలలో కనిపించడం లేదు.
తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న ఝాన్సీ, కవిత బుల్లితెరపై ఈ మధ్య కాలంలో కనిపించడంతో ఫ్యాన్స్ ఫీలవుతుండటం గమనార్హం.
అయితే ఝాన్సీ, కవిత డ్యాన్స్ చేసిన సమయంలో ఈటీవీ షో రికార్డింగ్ షోలా ఉందని కొంతమంది కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఆ కామెంట్ల వల్లే వీళ్లిద్దరికీ అవకాశాలు తగ్గాయి.అయితే ఫ్యాన్స్ మాత్రం గాజువాక కండక్టర్, నెల్లూరు కవితలకు అవకాశాలు వస్తే బాగుంటుందని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుండటం గమనార్హం.
అయితే ఝాన్సీ, కవిత ఈవెంట్లతో మాత్రం బిజీగానే ఉన్నారని తెలుస్తోంది.ఈవెంట్ల ద్వారా వీళ్లకు ఊహించని స్థాయిలో రెమ్యునరేషన్ దక్కుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.పలు సినిమాలలో కూడా వీళ్లకు ఆఫర్లు వస్తున్నాయని సమాచారం అందుతోంది.ఝాన్సీ, కవిత కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
వీళ్లిద్దరికీ సోషల్ మీడియాలో కూడా ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.రాబోయే రోజుల్లో వీళ్లకు ఆఫర్లు పెరుగుతాయేమో చూడాల్సి ఉంది.