హైదరాబాద్ లోని తెలంగాణ డీజీపీ కార్యాలయం దగ్గర హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.జీవో నంబర్ 46 ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రయత్నించారు.
ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు ముట్టడికి యత్నించిన కానిస్టేబుల్ అభ్యర్థులను అడ్డుకున్నారు.ఈ క్రమంలో నిరసనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాట ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.
అనంతరం కానిస్టేబుల్ అభ్యర్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.