జనసేనాని పవన్ కల్యాణ్ సెప్టెంబరు 2న పుట్టినరోజు జరుపుకోనున్నారు.ఈ నేపథ్యంలో, నెల్లూరు సిటీ జనసేన పార్టీ అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో 470 కేజీల వెండితో పవన్ కల్యాణ్ చిత్రరూపాన్ని రూపొదించారు.
వెండి గొలుసులు ఉపయోగించి ఈ కళాకృతిని తీర్చిదిద్దారు.దీనికి సంబంధించిన మేకింగ్ వీడియోను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, జనసేన నేతలు కొట్టే వెంకటేశ్వర్లు, సుందరరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.