పట్టాలెక్కించక ముందే 'వార్ 2' రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?

జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) ప్రజెంట్ గ్లోబల్ స్టార్ గా వెలుగొందుతున్న క్రమంలో ఈయన భారీ లైనప్ ను కూడా సెట్ చేసుకుంటూ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తున్నాడు.ఆర్ఆర్ఆర్ వంటి ఒకే ఒక్క సినిమాతో అందరిని ఆకట్టుకున్న తారక్ క్రేజీ లైనప్ సెట్ చేసుకోగా అందులో బాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా ఉంది.

 Hrithik Roshan - Jr Ntr Starrer War 2 Release On 2025's Republic Day, Hrithik Ro-TeluguStop.com

ఎన్టీఆర్ అండ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్( Hrithik Roshan ) కాంబోలో ”వార్ 2” ప్రకటించిన విషయం తెలిసిందే.

ఊహించని ఈ కాంబో ప్రకటించడమే సెన్సేషనల్ అయ్యింది.ఇందులో ఒక హీరోయిన్ గా కియారా అద్వానీ( Kiara Advani ) ఫిక్స్ అయ్యింది.యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థపై అత్యంత భారీ స్థాయిలో ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఈ నవంబర్ లో కానీ డిసెంబర్ లో కానీ స్టార్ట్ అవ్వనుందట.

ఈ లోపు ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న దేవర సినిమాను పూర్తి చేయనున్నాడు.

కాగా వార్ 2 సినిమా( War 2 )పై తాజాగా ఒక రూమర్ వైరల్ అవుతుంది.ఈ సినిమాను ఇంకా పట్టాలెక్కించకుండానే రిలీజ్ డేట్ సైతం ఫిక్స్ చేసారని టాక్.2025 రిపబ్లిక్ డే కానుకగా రిలీజ్ చేయనున్నారు అనే రూమర్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

యాక్షన్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ( Director Ayan Mukerji ) తెరకెక్కించనున్న ఈ ”వార్ 2” ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అధికారికంగా వివరాలు త్వరలోనే వెల్లడి కాకున్నాయట.చూడాలి ఈ సినిమా ఎలా ఉంటుందో.ఇక ఎన్టీఆర్ దేవర సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తుండగా ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఈ షూట్ పూర్తి కాగానే ఎన్టీఆర్ వార్ 2 షూట్ లో పాల్గొన బోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube