నల్లగొండ జిల్లా: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని గురుకులాల్లో జరుగుతున్న వరుస ఘటనలు తల్లిదండ్రులను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి.ఒకప్పుడు గురుకులంలో సీటు వస్తేపిల్లల భవిష్యత్ బాగుంటుందని భావించే పేరెంట్స్ గుండెల్లో ప్రస్తుత పరిస్థితులు రైళ్లు పరుగెట్టిస్తున్నయి.
భావి భారత పౌరులుగా తీర్చి దిద్దాల్సిన గురుకులాల్లో ఇలాంటి విషాద సంఘటన దేనికి సంకేతమని భావించాలి? అసలు విద్యార్థినులు ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడుతుండ్రు?
అసలు గురుకులాల్లో జరుగుతోంది…? జిల్లా వ్యాప్తంగా పేరెంట్స్ మదిని తొలిచేస్తున్న ప్రశ్నలకు సమాధానం దొరికే అవకాశం లేకుండా పోయింది.వివరాల్లోకి వెళితే…ఈ మధ్య కాలంలో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ గురుకులంలో 9వ,తరగతి విద్యార్ధిని క్లాస్ రూంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకొని మృతి చెందిన ఘటన మరువక ముందే నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎస్ఎల్బీసీలో ఉన్న గంధవారిగూడెం సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని ఆ కాలేజీ భవనంపై నుండి దూకి ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో విద్యార్థినికి కాళ్లు,పళ్ళు శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రస్తుతం బాలిక హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది.ఈ ఘటనలు ప్రమాదవాత్తు జరగినవి అని ఆయా పాఠశాలల యాజమాన్యం చిత్రీకరించే ప్రయత్నం చేసినా దాని వెనుక దాగివున్న వాస్తవ మర్మమేటిటనే విషయంలో పేరెంట్స్ లో అనేక అనుమానాలు కలుగుతున్నాయి.
జరిగిన ఘటనలను పాఠశాల ప్రిన్సిపాల్,సిబ్బంది గోప్యంగా ఉంచడంపై కూడా వారి అనుమానాలకు బలం చేకూరుతుంది.ఆ బాలిక భవనం పై నుండి దూకడానికి కారణం ఏమిటి ? ఆ అవసరం ఎందుకు వచ్చింది? నిజంగా ఆత్మహత్యేనా? లేక ఎవరైనా హతమార్చే ప్రయత్నం చేశారా? అసలు ఆ రోజు హాస్టల్ లో ఏం జరిగిందఅనే విషయాలపై ప్రిన్సిపాల్ స్పష్టత ఇవ్వకపోవడంతో పేరెంట్స్,విద్యార్ది సంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థినులు ఏమంటున్నారు…?వసతి గృహాల్లో కనీస వసతులు లేవని,మెనూ పాటించకుండా, కుళ్ళిపోయిన కూరగాయలు పెడతారని, ఈ విషయాలపై టీచర్లను ప్రశ్నిస్తే వేధింపులకు గురి చేస్తారని చెబుతున్నారు.ఈ ఘటన కూడా వేధించడం వల్లే జరిగిందని విద్యార్థులు,తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
హాస్టల్ పరిస్థితిపై పలు విద్యార్థి సంఘాల వారు,విద్యార్థుల తల్లిదండ్రులు పరిశీలించడానికి వస్తే కాలేజీలోకి అడుగుపెట్టకుండా అడ్డుకుంటారని అంటున్నారు.ప్రస్తుతం వసతి గృహాలు నరక కూపంగా మారాయని, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక విద్యార్థులు భయపడుతుంటే,ఏ చెడు వార్త వినాల్సి వస్తుందోనని పేరెంట్స్ ఆందోళనకు గురవుతున్నారు.
ఈ గురుకులాలపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో టీచర్లు ఇష్టారాజ్యంగా నడుపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంత జరుగుతున్నా జిల్లా మంత్రి,ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు కనీసం ఈ ఘటనపై స్పందించక పోవడం గమనార్హం.
ఇవి గురుకులాలా?మృత్యు కూపాలా అని పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు.ఇప్పటికైనా గురుకులాల్లో సరైన వసతులు కల్పించి, రక్షణ చర్యలు చేపట్టి, జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను సమాజానికీ తెలియజేయాలని కోరుతున్నారు.