రూపే డెబిట్ కార్డులకు( Rupay Debit Card ) ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది.భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఈ కార్డులకు క్రేజ్ పెరుగుతోంది.
వివిధ రకాల ఆఫర్స్ తో పాటు షాపింగ్, సినిమా టికెట్లు, ఎయిర్ పోర్ట్ లాంజ్, రెస్టారెంట్లలో డైనింగ్‌పై భారీ తగ్గింపును ఇస్తోంది.దీంతో డిస్కౌంట్స్ కోసం చాలామంది రూపే డెబిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు.
తొమ్మిదేళ్ల క్రితం ఇండియాలో రూపే డెబిట్ కార్డులను ప్రారంభించారు.వీసా, మాస్టర్ కార్డులకు ధీటుగా ఇప్పుడు రూపే డెబిట్ కార్డులు కస్టమర్లలో క్రేజ్‌ను సంపాదించుకుంటున్నాయి.
రూపే క్రెడిట్ కార్డులు( Rupay Credit Card ) కూడా రాగా.వీటి ద్వారా యూపీఐ పేమెంట్స్ చేసే అవకాశాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు.ప్రస్తతుం 1100కుపైగా ప్రభుత్వ, ప్రైవేట్, కోఆపరేటివ్ బ్యాంకులు రూపే కార్డులను కస్టమర్లకు జారీ చేస్తున్నాయి.ఇండియాలో 67 కోట్లకుపైగా మంది రూపే డెబిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు.రూపే డెబిట్ కార్డుల్లో క్లాసిక్, ప్లాటినం, సెలక్ట్ పేరుతో వేర్వేరు కార్డులు ఉన్నాయి.
రూపే డెబిట్ కార్డులలో క్లాసిక్ కార్డు( Rupay Classic Debit Card )ను బేసిక్ కార్డుగా చెబుతారు.ఈ కార్డు ద్వారా అమెజాన్, స్విగ్గీలో ఆఫర్లతో పాటు డొమెస్టిక్ రైల్వే స్టేషన్స్, ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ పొందవచ్చు.అలాగే రూ.2 లక్షల వరకు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, పర్మనెంట్ డిసెబిలిటీ కవర్ లభిస్తుందగి.అలాగే రూపే సెలక్ట్ కార్డ్ ను ప్రీమియంగా కార్డుగా చెబతారు.
రైల్వే స్టేషన్స్, ఎయిర్ పోర్టులలో లాంజ్ యాక్సెస్ తో పాటు 20కిపైగా ప్రీమియం గోల్ప్ కోర్సులలో కాంప్లిమేటరీ గోల్ప్ గేమ్ యాక్సెస్ వస్తుంది.అలాగే జియో మెంబర్‌షిప్, ఓటీటీ బెనిఫిట్స్ పొందవచ్చు.అలాగే రూ.10 లక్షల పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ నౌకర్యంతో పాటు పర్మనెంట్ డిసెబులిటీ కూడా ఈ కార్డులో లభిస్తుంది.ఇలా రూపే కార్డుల వల్ల అనేక బెనిఫిట్స్ ఉన్నాయి.