రద్దీ పెరిగి రాకపోకలకు ఇబ్బంది...!

నల్గొండ జిల్లా:నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలో 2016 లో తిరుమలగిరి (సాగర్) మండలం ఏర్పాటు చేశారు.అప్పుడున్న సింగిల్ రోడ్డున డబుల్ రోడ్డుగా మార్చుతామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు.

 Due To The Increase In Traffic, It Is Difficult To Travel , Travel-TeluguStop.com

ఏళ్లు గడుస్తున్నా రోడ్డు నిర్మాణ పనులకు అతీగతీ లేదని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కొత్త మండలం ఏర్పాటుతో వివిధ పనుల నిమిత్తం మండల ప్రజలు మండల కేంద్రానికి రాకపోకలు సాగిస్తూ ఉండడం, యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంతో వందల సంఖ్యలో వాహనాల రద్దీ పెరిగడంతో సింగిల్ రోడ్డుపై తరచూ ప్రమాదాలు జరిగి అనేకమంది గాయపడ్డారని వాపోతున్నారు.

ఎన్నికలు వచ్చినప్పుడే తిరుమలగిరి సాగర్ మండలానికి డబుల్ రోడ్డు నిర్మాణం గుర్తొస్తుందని,ఎన్నికలు అయ్యాక దాని ఊసెత్తే నాథుడే కరువయ్యాడని మండిపడుతున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు,ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకొని డబుల్ రోడ్డు నిర్మాణ పనులు మొదలు పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube