ఈ చిన్నప్పటి ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా...?

తెలుగులో ప్రముఖ దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన “మెంటల్ మదిలో” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన మళయాళబ్యూటీ  “నివేదా పేతురాజ్” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతో తన మొదటి చిత్రంతోనే ప్రేక్షకులని బాగానే ఆకట్టుకోవడంతో వరుస సినిమా అవకాశాలు క్యూ కట్టాయి.

 Telugu You Heroine Nivetha Pethuraj Shared Childhood Photo With Her Mother, Nive-TeluguStop.com

అంతేగాక ఇప్పటి వరకు ఈ అమ్మడు హీరోయిన్ గా నటించిన చిత్రాలలో ఎక్కువ శాతం హిట్లు ఉండడంతో ఈ అమ్మడికి బాగానే క్రేజ్ మరియు ఫయాన్ ఫాలోయింగ్ బాగానే పెరిగింది.

అయితే ఈ మధ్య కాలంలో సినిమా షూటింగులు లేకపోవడంతో నివేదా పేతురాజ్ ఇంటి పట్టునే ఉంటోంది.

 దీంతో సోషల్ మీడియా మాధ్యమాలలో అప్పుడప్పుడు బాగానే యాక్టివ్ గా ఉంటోంది.కాగా తాజాగా నివేదా పేతురాజ్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన సోదరుడు మరియు తల్లితో కలిసి తన చిన్నప్పుడు తీసుకున్న ఫోటోని షేర్ చేసింది.

అంతేగాక తనకి తన తల్లి అంటే ఎంతో ఇష్టం అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది.ఈ ఫోటోని షేర్ చేసిన కొంత కాలంలోనే లక్షల సంఖ్యలో లైకులు కామెంట్లు వచ్చాయి.

 అంతేగాక కొంత మంది నెటిజన్లు ఈ ఫోటో పై స్పందిస్తూ చిన్నప్పుడు నివేదా పేతురాజ్ చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

Telugu Ivethapethuraj, Red, Telugu, Telugunivetha, Tollywood-Latest News - Telug

అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో ప్రస్తుతం నివేద పేతురాజ్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నటువంటి “రెడ్” అనే చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది.కాగా ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది.తాజాగా తమిళ భాషలో తెరక్కెకుతున్న “పార్టీ” అనే చిత్రంలో కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube