ఈ తెలుగు వెటరన్ హీరోయిన్ మళ్ళీ రీ - ఎంట్రీ ఇస్తోందా...- Telugu Veteran Heroine Madhumitha Sivabalaji Is Re Entry As A Heroine In Tollywood

Telugu veteran heroine Madhumitha sivabalaji is re entry as a heroine in Tollywood, Madhumitha sivabalaji, Telugu veteran heroine, Tollywood, Sivabalaji, Madhumitha Heroine entry news, - Telugu Madhumitha Heroine Entry News, Madhumitha Sivabalaji, Sivabalaji, Telugu Veteran Heroine, Telugu Veteran Heroine Madhumitha Sivabalaji Is Re Entry As A Heroine In Tollywood, Tollywood

తెలుగులో ప్రముఖ సీనియర్ దర్శకుడు ముప్పలనేని శివ దర్శకత్వం వహించిన “సందడే సందడి” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి పరిచయమైన ప్రముఖ తమిళ హీరోయిన్ “మధుమిత” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.మధుమిత ఎక్స్ పోజింగ్ కి దూరంగా ఉంటూ పలు ఫ్యామిలీ ఓరియంటెడ్ పాత్రలలో నటించి సినీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

 Telugu Veteran Heroine Madhumitha Sivabalaji Is Re Entry As A Heroine In Tollywood-TeluguStop.com

అయితే సినిమా కెరీర్ పరంగా వరుస అవకాశాలతో రాణిస్తున్న సమయంలో టాలీవుడ్ హీరో శివ బాలాజీ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.పెళ్లయిన తర్వాత మధుమిత కుటుంబ బాధ్యతలను చక్కబెట్టే బాధ్యతలను తీసుకోవడంతో సినిమాలపై పెద్దగా దృష్టి సారించ లేకపోయింది.

కానీ అప్పుడప్పుడు అడపాదడపా పాత్రలను చేస్తూ ప్రేక్షకులను అలరించింది.అయితే మధుమిత తెలుగు, తమిళం, మలయాళం, తదితర భాషలలో కలిపి దాదాపుగా 20 కి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.

 Telugu Veteran Heroine Madhumitha Sivabalaji Is Re Entry As A Heroine In Tollywood-ఈ తెలుగు వెటరన్ హీరోయిన్ మళ్ళీ రీ – ఎంట్రీ ఇస్తోందా…-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ మధ్య కాలంలో మధుమిత సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది.ఈ క్రమంలో పలు రకాల ఫోటోషూట్ సంస్థలు నిర్వహిస్తున్న ఫోటోషూట్ కార్యక్రమాలలో కూడా పాల్గొంటోంది. అంతేగాక ఆ ఫోటోలను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ రోజురోజుకీ ఫాలోవర్ల సంఖ్య పెంచుకుంటుంది.అయితే తాజా సమాచారం ప్రకారం మధుమిత మళ్లీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతోందని టాలీవుడ్ సినీవర్గాలు చర్చించుకుంటున్నారు.

అయితే గతంలో మధుమిత తన పాత్రలతో సినీ ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నప్పటికీ పెళ్లి కారణంగానే సినిమా పరిశ్రమకు దూరమైందని ఇప్పుడు మళ్లీ సినిమాలపై దృష్టి సారించడంతో ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మధుమిత తమిళంలో ప్రముఖ దర్శకుడు వెట్రివేల్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్న “బుద్ధాన్ యేసు గాంధీ” అనే చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది.

 ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా మొదలైనట్లు సమాచారం. ఇటీవలే మరో ప్రముఖ తమిళ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న “గర్జనై” అనే చిత్రంలో నటించడానికి కూడా మధుమిత గ్రీన్ సిగ్నల్  ఇచ్చింది.

#Sivabalaji #TeluguVeteran #TeluguVeteran

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు