1.కువైట్ లో నర్సుల రిక్రూట్మెంట్ .ఇండియన్ ఎంబసీ కీలక సూచన
కువైట్ లో భారత నర్సుల నియామకాలపై రాయబారి సిబి జార్జ్ కీలక సూచన చేశారు.భారత ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా మాత్రమే రిక్రూటర్లకు ఫీజు చెల్లించాలని తెలిపారు.
2.తెలంగాణ మంత్రి తో శ్రీలంక ఎంబసీ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో శ్రీలంక దేశ ఎంబీసీ లో ని డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ డి వెంకటేశ్వర గురువారం హైదరాబాదులోని తన కార్యాలయంలో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా తెలంగాణ శ్రీలంకల మధ్య పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా ,సాంస్కృతిక సంబంధాలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో ఆయన చర్చించారు.
3.అమెరికాలో క్రికెట్ స్టేడియానికి భారతీయ అమెరికన్ల పేర్లు
అమెరికా ప్రజలకు క్రికెట్ ను పరిచయం చేసేందుకు కృషి చేసిన భారతీయ అమెరికన్ దంపతుల పేర్లను ఇండియా హౌస్ హుస్టన్ అనే సంస్థ నిర్మించిన స్టేడియానికి డాక్టర్ దుర్గ అగర్వాల్ సుశీల్ అగర్వాల్ దంపతుల పేరు ఖరారు అయ్యింది.
4.కెనడా అమెరికా తెలుగు సదస్సు
కెనడా అమెరికా తెలుగు సదస్సు దిగ్విజయంగా సాగింది.వర్చువల్ గా జరిగిన ఈ సదస్సులో యాభై శాతం మంది రచయితలు, యాభై శాతం మంది అమెరికా రచయితలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో కెనడా మినిస్టర్ ప్రసాద్ పండా, తనికెళ్ల భరణి, సుద్దాల అశోక్ తేజ, వడ్డేపల్లి కృష్ణ, డేనియల్ నాజర్, భువనచంద్ర, బలభద్రపాత్రుని రమణి, మహోజబీన్ సదస్సుకి హాజరై ప్రసంగించారు.
5.చైనా కు వ్యతిరేకంగా నేపాల్ ప్రజల ఆందోళన
చైనా పై నేపాలీలు ఆగ్రహంతో ఉన్నారు తమ భూభాగంలోకి చొచ్చుకొని వచ్చి అక్రమంగా వాడుకోవడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు.గురువారం లో లోక్ తాంత్రిక్ యువ మంచ్ ఆధ్వర్యంలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ‘ చైనా గో బ్యాక్ ‘ ‘ రిటర్న్ అవర్ ల్యాండ్ ‘ అంటూ నినాదాలు చేశారు.
6.కాబూల్ లో మహిళల నిరసన.కాల్పులు
ప్రభుత్వం తమ హక్కులను హరి స్పందనకు ఆఫ్ఘన్ రాజధాని కాబూల్లో మహిళలు ఆందోళనకు దిగారు.దీంతో వారిని చెదరగొట్టేందుకు తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరిపారు.
7.తాలిబన్ల విషయంపై అమెరికా నిఘా వర్గాల హెచ్చరిక
తాలిబాన్ లోనుంచి ప్రపంచానికి కొత్త ముప్పు ఏర్పడబోతోంది అంటూ అమెరికా నిఘా వర్గాలు హెచ్చరించాయి.
8.రోహింగ్యా నాయకుడి కాల్చివేత
ప్రముఖ రోహింగ్యా నేత మోహిబుల్లాను బంగ్లాదేశ్ బజార్ లో ఉన్న శరణార్థుల క్యాంపులో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
9.ప్రపంచంలో పొట్టి ఆవు రాణి మృతి
ప్రపంచంలోనే అత్యంత పొట్టి ఆవు గా గుర్తింపు పొందిన ‘ రాణి ‘ మృతి చెందింది.బంగ్లాదేష్ రాజధాని డాకా దగ్గర లోని చారిగ్రామ్కు చెందిన ఎమ్.ఏ హాసన్ దీని యజమాని.
10.ఉత్తర కొరియా మరో ప్రయోగం
కొత్త హైపర్ సోనిక్ క్షిపణి ని ఉత్తర కొరియా పరీక్షించింది.హసంగ్ -8 గా దీనిని పిలుస్తున్నారు.