1.చైనాలోని ఆ నగరంలో లాక్ డౌన్
కరోనా, ఒమి క్రాన్ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో చైనా లోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన జియంగ్ లో లాక్ డౌన్ విధించారు.
2.ఒమి క్రాన్ ఎఫెక్ట్ : 11,500 విమాన సర్వీసుల రద్దు

ఒమి క్రాన్ వైరస్ ప్రభావం తో ప్రపంచ దేశాలన్నీ విమాన సర్వీసుల పై ఆంక్షలు విధిస్తున్నాయి.గత శుక్రవారం నుంచి ఇప్పటి వరకు 11,500 విమాన సర్వీసులు రద్దయ్యాయి.
3.ఎలెన్ మస్క్ పై చైనా ఆరోపణలు
అమెరికా బిలినియర్ ఎలెన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రాజెక్ట్ పై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది.ఎలెన్ మస్క్ కు చెందిన స్పేస్ రాకెట్ వల్ల తమ అంతరిక్ష కేంద్రానికి ముప్పు వాటిల్లినట్టు పేర్కొంది.
4.పూజారులను నియమించుకుంటున్న నాసా

గ్రహాంతరవాసుల ఆచూకీ తెలుసుకునేందుకు నాసా పూజారులను నియమించుకుంటోంది.అంతరిక్ష రహస్యం చేధించేందుకు 24 మంది పూజారుల సహకారం తీసుకోనుంది.
5.భారత్ కు సలహా ఇచ్చిన పాకిస్థాన్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మహమూద్ ఖురేషి హరిద్వార్ ధర్మ సంసద్ లో ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రసంగాలు ఇవ్వడం పై పాకిస్థాన్ ప్రభుత్వం సోమవారం ఇస్లామాబాద్ లో భారత దౌత్య వెత్తను పిలిచి మాట్లాడింది.
6.ప్రపంచం లో మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్

ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థ గా భారత్ అవతరించనుంది.సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ రీసెర్చ్ తాజాగా వెలువరించిన నివేదికలో ఈ అంశాలను ప్రస్తావించింది.
7.క్వీన్ ఎలిజబెత్ హత్య కు కుట్ర .యువకుడి అరెస్ట్

బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజిబిత్ హత్య కు కుట్ర చేసినందుకు 19 సంవత్సరాల యువకుడిని స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
8.జాతి సంపదల వేలం ఆపాలని సౌత్ ఆఫ్రికా డిమాండ్
నెల్సన్ మండేలా 18 ఏళ్ల పాటు కారాగార దీక్ష అనుభవించిన జైలు గది తాళం చెవిని అమెరికా లో జనవరి 28 న వేలం వేయనుంది.ఈ వేలాన్ని దక్షిణాఫ్రికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
9.యాషెస్ సిరీస్ ను కైవసం చేసుకున్నఆస్ట్రేలియా

యాషెస్ సిరీస్ ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది.ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టెస్ట్ లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది.
10.కిమ్ డూప్ కి బెదిరింపులు
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ ను పోలి ఉన్న దక్షిణ కొరియా దేశానికి చెందిన కెమ్ మిన్ యోంగ్ అనే వ్యక్తి కిమ్ ను హేళన చేస్తూ అనేక వీడియో లు చేస్తూ ఉంటాడు.దీంతో ఇప్పుడు అతడిని చంపుతాము అంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ పెరిగిపోయాయి.