అంతకు ముందు ఆ తరువాత సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న హీరోయిన్ ఇషా రెబ్బ.మంచి టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు అనుకున్న స్థాయిలో స్టార్ హీరోయిన్ అయితే సక్సెస్ కాలేకపోయింది.కాని కుర్ర హీరోలకి జోడీగా ఆడిపాడింది.ఈ మధ్య కాస్తా గ్లామర్ డోస్ పెంచిన కూడా తెలుగు పెద్దగా ప్రయత్నాలు వర్క్ అవుట్ కావడం లేదు.తెలుగు దర్శకులు అందరూ ఇప్పుడు మల్లు భామల యావలో ఉండటంతో తెలుగు భామలపై అస్సలు శ్రద్ధ చూపించడం లేదు.దీంతో ప్రస్తుతానికి తెలుగులో ఇషా రెబ్బ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ మూవీలో నటించింది.
అలాగే శాకుంతలం సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుంది.ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ఇప్పటికే కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అక్కడ శివరాజ్ కుమార్ తో ఒక సినిమాలో హీరోయిన్ గా నటించబోతుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ లో ఇషా రెబ్బ భాగం అయ్యింది.
ఈ సినిమాతో తమిళ్, మలయాళీ ఇండస్ట్రీలో ఒకేసారి అడుగుపెడుతుంది.తెలుగు భామలకి పరభాషలలో మంచి అవకాశాలు ఉంటాయి.ఈ నేపధ్యంలో అరవింద్ స్వామి నెక్స్ట్ చేయబోయే తమిళ్, మలయాళీ ద్విభాషా చిత్రంలో ఇషా రెబ్బ మెయిన్ హీరోయిన్ గా ఎంపికైంది.
ఈ సినిమాలో అరవింద్ స్వామికి జోడీగా ఆమె కనిపించబోతుంది.ఇక తాజాగా మలయాళంలో తన ఎంట్రీసినిమాపై ఇషారెబ్బ ఆసక్తికర కామెంట్స్ చేసింది.ఇద్దరు స్నేహితుల అనుబంధం నేపధ్యంలో ఆ సినిమా ఉండబోతుందని, అందులో కంప్లీట్ డిఫరెంట్ మేకోవర్ లో తాను కనిపిస్తానని చెప్పుకొచ్చింది.కచ్చితంగా తన పాత్ర సర్ప్రైజ్ చేస్తుందని క్లారిటీ ఇచ్చింది.
ఈ మూవీలో అరవింద్ స్వామితో పాటు మలయాళీ నటుడు కుంచకో బొబ్బన్ మరో హీరోగా నటిస్తున్నాడు.