తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి( TDP ) పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ( Chandrababu Naidu ) కొద్ది రోజులుగా దృష్టి సారించారు.తెలంగాణలో అధికారంలోకి వచ్చే అంత స్థాయిలో టిడిపికి ప్రస్తుతం బలం లేకపోయినా, తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ బలమైన కేడర్ ఉండడం, కొన్ని ప్రధాని సామాజిక వర్గాలు ఇప్పటికీ టిడిపిని ఆదరిస్తూ ఉండడంతో, తెలంగాణలో టిడిపికి పునర్ వైభవం తీసుకొచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు .
ఇటీవలే తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ను( Kasani Gnaneshwar ) చంద్రబాబు నియమించారు.పార్టీని యాక్టివ్ చేయడం ద్వారా, తెలంగాణలో కొన్ని స్థానాల్లో టిడిపి అభ్యర్థులు గెలిచినా, రాజకీయ చక్రం తిప్పవచ్చు అనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారు.
అందుకే కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.దీనిలో భాగంగానే తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టేందుకు తెలంగాణ టిడిపి సిద్ధమవుతోంది.
ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు సైతం తెలంగాణ టిడిపితో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో, పార్టీని మరింత బలోపేతం చేయడం ద్వారా మరింత బలం పెంచుకోవాలి అనే లెక్కల్లో టీటీడీపీ ఉంది.దీనిలో భాగంగానే టిడిపిని సంస్థగతంగా బలోపేతం చేసేందుకు క్షేత్రస్థాయిలో పార్టీ కి ఆదరణ పెంచుకునేందుకు బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారు.ఇదే విషయాన్ని తెలంగాణ టిడిపి అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ తెలియజేశారు.త్వరలోనే బస్సు యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ షెడ్యూల్ ప్రకటిస్తామని జ్ఞానేశ్వర్ ప్రకటించారు.పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో ఎన్టీఆర్ భవన్ లో సమావేశం నిర్వహించిన జ్ఞానేశ్వర్ బస్సు యాత్రను విజయవంతం చేసేందుకు రానున్న అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసేందుకు గ్రామ, మండల, డివిజన్ కమిటీలను నియమించాలని నిర్ణయించుకున్నారు.నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ, ప్రజల్లో ఉండే విధంగా తెలంగాణ టిడిపి ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు.
అలాగే పార్టీ నేతలు అందరిని ఏకతాటిపైకి తీసుకొచ్చి టిడిపిని మరింతగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఉన్నారు.
తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు కొద్ది నెలలు మాత్రమే ఉండడంతో, టిడిపి గెలిచే అవకాశం ఉన్న స్థానాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.అక్కడ బలమైన అభ్యర్థులను పోటీకి దించి ప్రధాన పార్టీలకు గట్టి పోటీ ఇవ్వాలని, పదుల సంఖ్యలో అయినా తెలంగాణలో సీట్లు సాధించాలనే లక్ష్యంతో తెలంగాణ టిడిపి ఉంది.అయితే ప్రస్తుతం తెలంగాణలో టిడిపికి పునర్ వైభవం తీసుకురావడం అంటే అంత అషామాషి వ్యవహారం కాదు.
ఇప్పటికే ఆ పార్టీలో బలమైన నేతలంతా బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ లలో చేరిపోయారు.కేవలం పార్టీ మారేందుకు అవకాశం లేక, రాజకీయాలపై అంత ఆసక్తి లేనట్టుగా వ్యవహరిస్తున్న వారు మాత్రమే ప్రస్తుతం పార్టీలో కొనసాగుతున్నారు.
తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు తెలంగాణ టిడిపి నాయకులు ఏ మేరకు యాక్టివ్ అవుతారు అనేది తేలాల్సి ఉంది.