నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలో ఉన్న రాణి రుద్రమదేవి మరణ శాసనాన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్ వచ్చి మరణ శాసనాన్ని పరిశీలించారు.అనంతరం మీడియా సమావేశంలో రాణి రుద్రమ గొప్పతనం గురించి ఆమె చేసిన త్యాగాల గురించి గవర్నర్ మాట్లాడారు.
చరిత్రలో రాజుల గురించి ఎక్కువగా ప్రజలకు తెలిసేలా చేశారు కానీ రాణుల త్యాగాలపై ఎటువంటి ప్రచారం లేకుండా ఉండిపోయింది రాణి రుద్రమదేవి ఆ కాలంలోనే సమాజాన్ని ఎదిరించి స్త్రీ జాతి ఔన్నత్యానికి పాటుపడిందని, ఆడపిల్లలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి చదువుకోవాలి అన్ని విధులు నేర్చుకోవాలి అని గవర్నర్ అన్నారు.కాకతీయ కలా వైభవం రాణి రుద్రమదేవి ద్వారా విరాజిల్లుందని గవర్నర్ తెలిపారు.
రాణి రుద్రమ్మ మరణ శాసనం చందుపట్ల గ్రామంలో ఉన్నట్లు తెలుసుకున్న నేను రావాలని ఆవిడ వీర గాధలు తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చానని తెలియజేశారు.గ్రామస్తులు కోరిక మేరకు రాణి రుద్రమదేవి ఆర్చిని గ్రామం వద్ద ఏర్పాటు చేయాలని కోరారు దానిని నేను పరిశీలిస్తానని గవర్నర్ హామీ ఇచ్చారు.
మరణశాసనం వద్ద పూలమాలలు వేసి గౌరవ వందనం చేశారు గవర్నర్ చందుపట్ల రోడ్డు పక్కన ఉన్న రుద్రమదేవి కాంస్య విగ్రహాన్ని గవర్నర్ ఆవిష్కరించారు
.