తెలంగాణ బీజేపీ రేపు నిర్వహించ తలపెట్టిన ధర్నాకు రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ మేరకు హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద బీజేపీ చేపట్టనున్న మహాధర్నాకు న్యాయస్థానం అనుమతిని ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
మహాధర్నాకు అనుమతి కోరుతూ బీజేపీ నేతలు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం ధర్నా నిర్వహించేందుకు పచ్చజెండా ఊపింది.కోర్టు అనుమతి వచ్చిన నేపథ్యంలో పార్టీ శ్రేణులు రేపటి మహాధర్నాకు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారని తెలుస్తోంది.