తెలంగాణ ఎన్నికల ప్రచారం లో హీరో నాని..వైరల్ అవుతున్న ప్రెస్ మీట్!

ప్రస్తుతం తెలంగాణ లో ఎన్నికల ప్రచారం ఏ రేంజ్ లో జరుగుతుందో మన అందరం చూస్తూనే ఉన్నాం.ఈరోజు నుండి అసెంబ్లీ ఎన్నికలకు( assembly elections ) సరిగ్గా పది రోజుల సమయం ఉంది.

 Telangana Election Campaign Hero Nani Press Meet Going Viral , Assembly Election-TeluguStop.com

ఈ పది రోజుల్లో వీలైనంత ఎక్కువ ఓట్లను దండుకోవడానికి రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి.జనాలకు ఇష్టమొచ్చినట్టు హామీలు జారీ చేసేస్తున్నారు.

అయితే తెలంగాణ లో ఎన్ని పార్టీలు పోటీ చేసినప్పటికీ, నువ్వా నేనా అనే రేంజ్ లో ప్రధాన పోటీ ని ఎదురుకోబోయ్యే రెండు పార్టీలు మాత్రం కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్.గత రెండు ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ( BRS Party )కి వార్ వన్ సైడ్ అనే రేంజ్ లో ఉండేది.

కానీ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏకులో మేకులాగా తయారైంది.నువ్వా నేనా అనే రేంజ్ పరిస్థితి కి వచ్చింది.

ఇదంతా పక్కన పెడితే ఈ తెలంగాణ ఎన్నికలను హీరో నాని తనదైన శైలి లో తన సినిమాకి పనికొచ్చేలా వాడుకున్నాడు.

Telugu Assembly, Brs, Nani, Press Meet, Telangana, Telangananani-Movie

ఆయన హీరో గా నటించిన ‘హాయ్ నాన్న’ ( hi nanna )చిత్రం వచ్చే నెల 7 వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం మరియు మలయాళం భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది.ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ భాగంగా రాజకీయ నాయకుడి స్టైల్ లో గెటప్ వేసుకొని, ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి, హామీలు ఇస్తున్నట్టుగా నాని ‘హాయ్ నాన్న’ చిత్రం గురించి హామీలు ఇచ్చాడు.ఈ హామీలు ఇవ్వడం కాస్త ఫన్నీ గా, రాజకీయ నాయకులకు పరోక్షంగా సెటైర్లు వేసినట్టు గా అనిపించింది.

మీడియా రిపోర్టర్ నాని ని ఒక ప్రశ్న అడుగుతూ ‘అన్నీ సినిమాలు శుక్రవారం విడుదల అవుతాయి కదా, మరి మీరు కూడా శుక్రవారం అనగా డిసెంబర్ 8 వ తేదీన వచ్చేయొచ్చు కదా’ అని అడుగుతాడు.అప్పుడు నాని దానికి సమాధానం ఇస్తూ ‘బాగా పరిపాలించిన ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి ఏమాత్రం ఆలోచించదు, మా సినిమా కూడా అంతే, అందుకే మేము ముందుగా విడుదల చేస్తున్నాం’ అంటూ చెప్పుకొచ్చాడు.

Telugu Assembly, Brs, Nani, Press Meet, Telangana, Telangananani-Movie

ఇకపోతే నాని కి ఓవర్సీస్ లో మంచి క్రేజ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే.దీని గురించి ఆయన మాట్లాడుతూ ‘మా హాయ్ నాన్న పార్టీ కి NRI ల నుండి కూడా మంచి ఆదరణ దక్కుతుంది.కాబట్టి వాళ్ళ కోసం సుదర్శన్ 35 ఏం ఏం, సంధ్య 70 ఏం ఏం వంటి థియేటర్స్ ని ఏర్పాటు చేస్తున్నాం.పేపర్స్ మీరే తెచ్చుకోవాలి, చింపి విసిరేంత కంటెంట్ ని మేము కచ్చితంగా ఇస్తామని చెప్తున్నాం’ అంటూ చెప్పుకొస్తాడు.

చాలా ఫన్నీ గా ఉన్నటువంటి ఈ వీడియో ని మీరు కూడా క్రింద చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube