సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కానున్న సినిమాలలో హనుమాన్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.తేజ సజ్జాను( Teja Sajja ) సూపర్ హీరోగా పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.“మానవాళి మనుగడను కాపాడటానికి నీ రాక అనివార్యం హనుమా” అనే డైలాగ్ ట్రైలర్ కు హైలెట్ గా నిలిచింది.ట్రైలర్ లో విజువల్ ఎఫెక్స్ట్ అద్భుతంగా ఉన్నాయి.
ప్రశాంత్ వర్మ ఈ సినిమాతో మ్యాజిక్ చేయడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
అఖండ్ భారత్ ఇతిహాసం నుంచి స్పూర్తి పొంది తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ కొన్ని షాట్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయి.
ప్రశాంత్ వర్మ( Prashant Verma ) డైరెక్టర్ గా ఈ సినిమాతో తన స్థాయిని మరింత పెంచుకోవడం ఖాయమని చెప్పవచ్చు.ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా అద్భుతమైన షాట్స్ తో ప్రశాంత్ వర్మ మ్యాజిక్ చేశారు.
నిర్మాతలు ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడలేదని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.

ట్రైలర్ కు బీజీఎం హైలెట్ గా నిలిచింది.వరలక్ష్మి శరత్ కుమార్( Varalakshmi Sarath Kumar ) పాత్ర కూడా సరికొత్తగా ఉండనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.“పోలేరమ్మ మీదొట్టు.నా తమ్ముడి మీద చెయ్యి పడితే ఒక్కొక్కడికి టెంకాయలు పగిలిపోతాయి” అంటూ వరలక్ష్మి ట్రైలర్ లో చెప్పిన డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది.సినిమాలో యాక్షన్ సీన్స్ కు కూడా ఎక్కువగానే ప్రాధాన్యత ఉండనుందని తెలుస్తోంది.

హనుమాన్ పాత్రలో తేజ సజ్జా ఒదిగిపోయారు.కథ గురించి చాలా విషయాలను దాచేస్తూ ట్రైలర్ ను కట్ చేశారు.సంక్రాంతి పండుగకు మంచి సినిమాను చూడాలని భావించే వాళ్లు ఈ సినిమాపై దృష్టి పెట్టవచ్చు.2024 సంవత్సరం జనవరి నెల 12వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.2024 బిగ్గెస్ట్ హిట్లలో హనుమాన్ ఒకటిగా న్లిచే ఛాన్స్ అయితే ఉంది.హనుమాన్ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.