తేజ సజ్జ దర్శకత్వం లో ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో రూపొంది విడుదలకు రెడీ అవుతున్న చిత్రం హనుమాన్.ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి చాలా నెలలు అవుతోంది.
ముందుగా ఈ సినిమా ను ఆదిపురుష్ కన్నా ముందే విడుదల చేయాలని భావించారు.కానీ అనూహ్యంగా సినిమా కు సంబంధించిన వీఎఫ్‌ఎక్స్ వర్క్ ఆలస్యం అవుతున్న కారణంగా సినిమా ని వాయిదా వేస్తూ వచ్చిన విషయం తెల్సిందే.
సంక్రాంతికి సినిమా అంటూ చాలా రోజుల క్రితం ప్రకటించారు.అయితే సంక్రాంతికి కూడా ఈ సినిమా విడుదల అయ్యేనా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.
ఇండస్ట్రీ వర్గాల్లో సినిమా సంక్రాంతికి కూడా వస్తుందో లేదో అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.ఎందుకంటే వీఎఫ్‌ఎక్స్ వర్క్ కోసం దర్శకుడు అంతర్జాతీయ సంస్థ లతో వర్క్ చేయిస్తున్నాడు.
కనుక ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అంతా భావించారు.కానీ సంక్రాంతికే రాబోతున్నాం అంటూ హనుమాన్ టీమ్ మళ్లీ ప్రకటించారు.

కచ్చితంగా సినిమా ను ముందుగా అనుకున్న ప్రకారం సంక్రాంతికే విడుదల చేస్తామని తాజాగా ఓవర్సీస్ పార్టనర్ ని కూడా ప్రకటించడం జరిగింది.ఈ నేపథ్యం లో సంక్రాంతి పోరు మరింత రసవత్తరంగా మారడం ఖాయం అనిపిస్తోందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.హనుమాన్ సినిమా లో ఒక గ్రామానికి సంబంధించిన ఇష్యూ ని చూపిస్తారట.ఆ గ్రామం కోసం ఏకంగా ఆంజనేయుడు రావడం జరుగుతుందట.గతంలో ఇలాంటి కాన్సెప్ట్ లతో సినిమాలు వచ్చాయి.అయితే కచ్చితంగా ప్రశాంత్ వర్మ కొత్తగా ప్రేక్షకుల ముందుకు హనుమాన్ ని తీసుకు వచ్చే విధంగా రూపొందించి ఉంటాడు అంటూ ఆయన అభిమానులు మరియు ప్రేక్షకులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాకు మహేష్ బాబు గుంటూరు కారం, నాగార్జున నా సామి రంగ మరియు వెంకటేష్ సైంధవ్ సినిమాల నుంచి పోటీ ఎదురవ్వబోతుంది.మరి ఆ పోటీని హనుమాన్ ఎలా తట్టుకుని నెగ్గుకు వస్తాడు అనేది చూడాలి.