శీతాకాలంలో కూరగాయల సాగులో పాటించాల్సిన మెళుకువలు..!

కొన్ని రకాల కూరగాయలు( Vegetables ) శీతాకాలంలోనే అధిక దిగుబడులను ఇస్తాయి.కాబట్టి కాలానుసారంగా పండే పంటలకు అధిక ప్రాధాన్యం ఇస్తే మంచి లాభాలు పొందవచ్చు.

 Techniques In Winter Vegetable Cultivation Details, Farming Techniques ,winter V-TeluguStop.com

శీతాకాలంలో( Winter ) టమాట, మిరప, కాలీఫ్లవర్, క్యాబేజీ, దుంప జాతి కూరగాయలు లాంటి పంటల సాగు అనుకూలంగా ఉంటుంది.శీతాకాలంలో చీడపీడలను తట్టుకునే విత్తన రకాలను ఎంపిక చేసుకుంటే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుందని వ్యవసాయ క్షేత్ర నిపుణులు సూచిస్తున్నారు.

రబీలో చలి చాలా ఎక్కువ కాబట్టి సూక్ష్మధాతు పోషకాలు లోపించే అవకాశాలు ఎక్కువ.శీతాకాలంలో సూక్ష్మధాతు ఎరువులను సిద్ధం చేసుకోవాలి.

Telugu Agriculture, Cabbage, Cauli Flower, Techniques, Crop, Hybrid Seeds, Tomat

కూరగాయల సాగులో అధిక దిగుబడి కేవలం హైబ్రిడ్ విత్తనాల( Hybrid Seeds ) వల్లనే సాధ్యం.మార్కెట్లో నాణ్యత లేని విత్తనాలు చాలా ఉన్నాయి.కాబట్టి మేలు రకం విత్తనాలను చూసి కొనుగోలు చేయాలి.మిరప, టమాట, వంగ పంటలకు కుళ్ళు తెగుళ్లు( Pests ) సోకే అవకాశం చాలా ఎక్కువ.నీటి ద్వారా కూడా నారు మొక్కలకు కుళ్ళు తెగుళ్లు సోకే అవకాశం ఉంది.ఈ పంటలకు సాగును ఎత్తైన నారుమడులు తయారు చేసుకొని పెంచాలి.

నారుమడులు ఎత్తుగా ఉంటే మొక్కలు ఆరోగ్యకరంగా పెరిగే అవకాశం ఉంటుంది.

Telugu Agriculture, Cabbage, Cauli Flower, Techniques, Crop, Hybrid Seeds, Tomat

నారుమడులను ఏ విధంగా తయారు చేసుకోవాలంటే నాలుగు మీటర్ల పొడవు, ఒక మీటరు వెడల్పు ఉండేటట్లు అవసరం అయినన్ని నారుమడులు ఏర్పాటు చేసుకోవాలి.భూమిపై నుంచి 15 సెంటీమీటర్లు ఎత్తులో ఉండేలా నారుమడి తయారు చేసుకోవాలి.ముందుగా విత్తన మొలక శాతం పరీక్షించిన తరువాతే నారుమడులు పెంచుకోవాలి.

విత్తనాలలో మొలక శాతం 70% కంటే ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి.ఏ పంట సాగు చేయాలి అనుకున్న ఆ పంట విత్తనాలను ముందుగా విత్తన శుద్ధి చేసుకోవడం చాలా ముఖ్యం.

విత్తన శుద్ధి చేస్తే పంటకు భూమి నుంచి ఎలాంటి తెగుళ్లు లేదా చీడపీడలు ఆశించవు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube