ఏపీ ఎన్నికలు( AP Elections ) సమీపిస్తున్న తరుణంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.ఇప్పటికే ఓటర్ల జాబితాపై ఫోకస్ చేసిన ఈసీ తాజాగా టీచర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకోనున్నారు.
ఈ మేరకు టీచర్లను( Teachers ) ఎన్నికల విధుల్లోకి తీసుకునే ప్రక్రియను ఎన్నికల సంఘం ప్రారంభించింది.ఎన్నికల విధులకు సచివాలయ సిబ్బంది సరిపోతారని నిన్న సీఈసీ భేటీలో ప్రస్తావన వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే సీఈసీ ఆదేశాలతో డీఈవోలకు ఏపీ సీఈవో( AP CEO ) ఆదేశాలు జారీ చేసింది.రేపటిలోగా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.ఈ క్రమంలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లుగా ఈసీ టీచర్లను నియమించనుంది.